రాష్ట్రీయం

సయోధ్యా? సమరమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 20: కృష్ణా జలాల వాటాల పంపకంపై బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అగాధాన్ని పెంచింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించిన 1001 టిఎంసి నీటిలో నికర జలాలు, అదనపు జలాల్లోనే ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు పంచుకోవాలని ట్రిబ్యునల్ తీర్పు ఇవ్వడంతో తెలంగాణలోని నాలుగు ప్రతిష్టాకరమైన ఎత్తిపోతల పథకాలకు నికర జలాల సమస్య ఉత్పన్నమవుతోంది. ట్రిబ్యునల్ ఎదుట రెండు తెలుగు రాష్ట్రాలు ఒకే వాణిని వినిపించాయి. కానీ ఇప్పుడు ఎవరి వాటా ఎంతో తేల్చుకునేందుకు ఎవరి వాదనలు వారు ట్రిబ్యునల్ ఎదుట వినిపించాలి. అదే సమయంలో తమకు కేటాయించిన నీటి వాటా సమ్మతంగా లేదని రాష్ట్రం విడిపోకముందే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సుప్రీం కోర్టులో స్పెషల్ లీవు పిటిషన్ దాఖలు చేయగా, విభజన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఈ కేసులో ఇంప్లీడ్ అయింది.
ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ట్రిబ్యునల్ చెప్పినట్లు తమ వాదనలు వినిపించేందుకు సిద్ధమవుతోంది. అదే సమయంలో ట్రిబ్యునల్ తీర్పు గెజిట్ నోటిఫికేషన్ కాకుండా సుప్రీంకోర్టులో ఎస్‌ఎల్‌పి దాఖలు చేసేందుకు నిర్ణయం తీసుకోనుంది.
కృష్ణా జలాలపై ట్రిబ్యునల్ వద్ద సయోధ్యగా ఒకే వాదనను తెలంగాణతో కలిసి వినిపించడం ఆంధ్రప్రదేశ్‌కు కత్తిమీద సాము లాంటిదే. తెలంగాణలో నాలుగు ప్రతిష్ఠాత్మక ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. కల్వకుర్తికి 20 టిఎంసిలతో 2లక్షల ఎకరాలు, కల్వకుర్తికి 25 టిఎంసిలతో 3.40లక్షల ఎకరాలు, ఎలిమినేటి మాధవరెడ్డి స్కీం కింద 30 టిఎంసిలతో 3.700 లక్షల ఎకరాలు, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల స్కీంకు 90 టిఎంసిలతో 12.3లక్షల ఎకరాలకు, డిండి ఎత్తిపోతల పథకానికి 30 టిఎంసిలతో 3.5లక్షల ఎకరాలు సాగు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల స్కీం వల్ల దిగువన ఉన్న కృష్ణా డెల్టా, ఆంధ్రలోని నాగార్జునసాగర్ ఆయకట్టుకు సాగునీటి కొరత తలెత్తుతుందని గుంటూరుకు చెందిన రైతాంగం సుప్రీంకోర్టులో పిల్ వేసింది. ఈ చర్య తెలంగాణ ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పించింది.
కాగా పోలవరం ప్రాజెక్టు పూర్తి కాకుండానే పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా 80 టిఎంసిలను కృష్ణా నదిలోకి మళ్లించడం వల్ల అందులో 80 టిఎంసిల నీటిలో తెలంగాణకు 45 టిఎంసిల వాటా వస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఇప్పటికే కేంద్రానికి పలుసార్లు లేఖ రాశారు. పోలవరం డ్యాం పూర్తయితే కూడా 80 టిఎంసిలో 45 టిఎంసిల నీరు తమకు దక్కుతాయని తెలంగాణ వాదిస్తోంది. పట్టిసీమ పోలవరంలో అంతర్భాగమని, పోలవరం పూర్తయితేనే 1978 అవార్డు ప్రకారం ఎగువ రాష్ట్రాలకు 80 టిఎంసిల నీరు దక్కుతుందని ఏపి ప్రభుత్వం కేంద్రానికి తెలిపింది.
తాజా పరిణామాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టిసీమ పోలవరంలో భాగం కానందున ఎటువంటి పరిస్థితుల్లో కృష్ణా నదిలో ఆ మేరకు 45 టిఎంసిల నీటిని వాడుకునేందుకు వీలు లేదని, ఈవిషయమై తేల్చి చెప్పాలని నిర్ణయించింది. పట్టిసీమకు స్టోరేజి పాయింట్ లేనందు వల్ల తొందరపడి తెలంగాణకు 45 టిఎంసి నీటి వాటాను ఇచ్చేస్తే నాగార్జునసాగర్, కృష్ణా డెల్టాతో పాటు, రాయలసీమ ప్రాజెక్టులు ప్రమాదంలో పడుతాయి. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు వల్ల తెలంగాణలో నిర్మాణానికి సిద్ధమవుతున్న రంగారెడ్డి-పాలమూరు ఎత్తిపోతల, డిండి ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు సందేహంగా మారాయి. ఉమ్మడి ఆంధ్రాకు కేటాయించిన 811 నికర జలాల్లో 512.04 టిఎంసిలు ఆంధ్రాకు, 298 టిఎంసిలు తెలంగాణకు కేటాయించారు. కాగా అదనపు జలాల కింద 77 టిఎంసిల నీరు తెలంగాణకు, ఆంధ్రాకు 150.45 టిఎంసిల నీరు దక్కాయి. ఈ అదనపు జలాలపై ఆధారపడి ఎత్తిపోతల స్కీంలను నిర్వహించలేరు. అందుకే పట్టిసీమ పూర్తయినందు వల్ల ఎగువ రాష్టమ్రైన తెలంగాణకు 45 టిఎంసిల వాటా దక్కుతుందనే వాదనను బలంగా వినిపించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది