ఆంధ్రప్రదేశ్‌

మాచర్ల చైర్‌పర్సన్ శ్రీదేవి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాచర్ల, అక్టోబర్ 21: గుంటూరు జిల్లా మాచర్ల పురపాలక సంఘ మొదటి మహిళా చైర్‌పర్సన్ గోపవరపు శ్రీదేవి (28) శుక్రవారంనాడు పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. మూడు నెలలకిందట శ్రీదేవి భర్త మల్లికార్జునరావు గుండెపోటుతో మృతి చెందారు. భర్త మరణాన్ని జీర్ణించుకోలేని శ్రీదేవి తీవ్ర మానసిక వేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని బంధువులు తెలిపారు. ఉదయానే్న తన కోడలు శ్రీదేవిని నిద్ర నుండి లేపేందుకు ఎంతసేపు పిలిచినా స్పందించకపోవటంతో చుట్టుపక్కలవారి సాయంతో తలుపులు తెరచి చూడగా నోటినుండి నురగలు రావటాన్ని గమనించి ఆసుపత్రికి తరలించామని శ్రీదేవి మామ బ్రహ్మయ్య విలేఖరులకు తెలిపారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం గుంటూరు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందినట్లు ఆయన వాపోయారు. పురపాలక సంఘ ఇన్‌చార్జి చైర్‌పర్సన్ నెల్లూరి మంగమ్మ, వైయస్సార్‌సీపీ, టీడీపీ కౌన్సిలర్లు, ఉద్యోగులు, కార్మికులు ఆమె మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.