ఆంధ్రప్రదేశ్‌

వసతి గదులకు కాషన్ డిపాజిట్ రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల, అక్టోబర్ 21: తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులు బసచేసే టిటిడి వసతి గదులకు ఇప్పటి వరకు చెల్లించే కాషన్ డిపాజిట్‌ను సోమవారం నుంచి రద్దు చేయాలని టిటిడి ఇఓ సాంబశివరావు నిర్ణయించారు. గది అద్దెకు తీసుకుని తిరిగివెళ్లే సమయంలో అటెండర్లు అందుబాటులో లేకపోవడంతో పాటు తిరుగు ప్రయాణానికి రైళ్లు, విమానాల్లో వెళ్లే భక్తులు సమయం మించిపోతుందనే ఆందోళనతో కాషన్ డిపాజిట్‌ను వదలివెళ్తున్నారు. అలా భక్తులు వదలివెళ్లే కాషన్ డిపాజిట్ మొత్తం స్వామివారి ఖాతాలో జమవుతోంది. ఈ నేపథ్యంలో పలువురు భక్తులు కాషన్ డిపాజిట్లు తీసుకోవడంలో తాము ఎదుర్కొంటున్న సమస్యలను టిటిడి ఇఓ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో స్పందించిన ఇఓ సాంబశివరావు భక్తుల సౌకర్యార్థం కాషన్ డిపాజిట్ విధానాన్ని రద్దు చేయాలని నిర్ణయించారు.
రాజమహేంద్రవరం కోర్టుకు
అగ్రిగోల్డ్ ఎండి, డైరెక్టర్లు
కేసు నవంబర్ 4కు వాయిదా
ఆంధ్రభూమి బ్యూరో
రాజమహేంద్రవరం, అక్టోబర్ 21: అగ్రిగోల్డ్ ఎండి అవ్వా వెంకట రామారావు శుక్రవారం రాజమహేంద్రవరం జిల్లా కోర్టుకు హాజరయ్యారు. రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన అగ్రిగోల్డ్ బాధితులు నమోదు చేసిన వివిధ కేసుల్లో తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన కేసుల్లో విచారణ నిమిత్తం ఎండి వెంకట రామారావుతో పాటు నలుగురు డైరెక్టర్లను పోలీసులు రాజమహేంద్రవరం కోర్టులో హాజరుపరిచారు. అగ్రిగోల్డ్ బాధితులు ఆందోళనకు దిగుతారనే ఉద్దేశంతో పోలీసు బందోబస్తు నడుమ వారిని కోర్టుకు తీసుకొచ్చి రెండు గంటల అనంతరం తీసుకెళ్లారు. ఈ కేసు విచారణ వచ్చే నెల 4వ తేదీకి వాయిదా పడింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న కేసులన్నీ ఒకే న్యాయం స్థానం పరిధిలోకి చేర్చి, అక్కడే హాజరయ్యే విధంగా చూడాలని అగ్రిగోల్డ్ ఎండి, డైరెక్టర్లు హైకోర్టును ఆశ్రయించినట్టు తెలిసింది.