రాష్ట్రీయం

రైల్వే కార్యాలయాల్లో సహజ వెలుతురు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 25: రైల్వే చరిత్రలో తొలిసారిగా పర్యావరణ రహిత, విద్యుత్ పొదుపును దృష్టిలో ఉంచుకుని తమ కార్యాలయాల్లో సహజ వెలుతురు (డే లైట్ పైప్ టెక్నాలజీ) వాడకాన్ని దక్షిణ మధ్య రైల్వే చేపట్టి ముందడుగు వేసింది. 2011లో దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కార్యాలయం రైల్ నిలయంలో సిఎస్‌టిఈ, సిఈఈ కార్యాలయాల మధ్య ప్రయోగాత్మకంగా ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారు. దీని ఫలితం ఆశాజనకంగా ఉండడంతో రూ.3.96 లక్షల వ్యయంతో రైల్‌నిలయం పక్కనే ఉన్న రైల్వే ప్రింటింగ్ ప్రెస్‌లో కూడా వాడేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు రైల్వే వర్గాలు తెలిపాయి. అత్యంత సాధారణగా కోణియమితి సూత్రాల ఆధారంగా పని చేసే ఈ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా భవన పై కప్పులో ఏర్పాటు చేయబడే ఒక డోమ్ ద్వారా పగటి వెలుతురును పైపులద్వారా సేకరించి కార్యాలయ అంతర్భాగాల్లో పంపడం జరుగుతుందని తెలిపింది. సేకరించబడిన వెలుతురు పైపుల్లో వివిధ కోణాల్లో 95 నుంచి 95 శాతం మేరకు ప్రతిబింభించబడుతూ డిప్యూజర్ల ద్వారా చివర్లో ఏకరీతిగా విస్తరిస్తుందని తెలిపింది. ఇక పైపు లోపలి భాగం ఇన్సులేటర్‌గా పని చేయడం ద్వారా గదులలోకి కాంతి వేడి అతి తక్కువగా చేరుతుంది. ఈ కాంతి పైపులను ఫోర్‌నకు సమాంతరంగానే కాకండా పలు రకాల ఒంపులతో కూడా ఏర్పాటు చేయడం ఈ సాంకేతిక పరిజ్ఞానంలో ఇమిడి ఉన్న మరో విశేషమని రైల్వే వర్గాలు వెల్లడించాయి. ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని 100 కిలోవాట్ల విద్యుత్ వినియోగానికి సమానంగా ఉండే 86 సహజ డై లైట్ పైప్ వ్యవస్థను ఏర్పాటు చేశామని రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. రానున్న మార్చి 2016 నాటికి మరో ఇదే తరహాలో 39 యూనిట్లు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపింది. ఈ తరహా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగంచడం వల్ల విద్యుత్ వాడకంలో 1.8 కిలోవాట్ల విద్యుత్‌ను ఉపసంహరించడంతో ఏడాదికి రూ.62.8 వేల వ్యయం ఆదా అయ్యిందని తెలిపింది. డే లైట్ పైప్ సిస్టమ్ జీవిత కాలం 30 సంవత్సరాలు ఉంటుందని తెలిపింది.
36 వారాంతపు రైళ్లు
విశాఖ-సికింద్రాబాద్, విశాఖ-తిరుపతిల మధ్య 36 వారాంతపు రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. అధిక రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ రైళ్లను నడుపుతున్నట్లు తెలిపింది. డిసెంబర్ 1, 8, 15, 22, 29, జనవరి 5, 12, 19, 26 తేదీల్లో విశాఖపట్నం నుంచి నెం.08501 రైలు బయలుదేరుతుందని తెలిపింది. తిరుగు ప్రయాణంలో సికింద్రాబాద్ నుంచి డిసెంబర్ 2, 9, 16, 23, 30, జనవరి 6,13,20, 27 తేదీల్లో నెం.08502 రైలు బయలుదేరుతుందని తెలిపింది. విశాఖపట్నం-తిరుపతి మధ్య నవంబర్ 30, డిసెంబర్ 7, 14, 21, 28 జనవరి 4, 11, 18, 25 తేదీల్లో నెం.08573 రైలు బయలుదేరుతుందని తెలిపింది. తిరుగుప్రయాణంలో తిరుపతి నుంచి నెం.08574 రైలు డిసెంబర్ 1, 8, 15, 22, 29, జనవరి 5, 12, 19, 26 తేదీల్లో బయలు దేరుతుందని తెలిపింది.
26 సువిధ సూపర్‌ఫాస్ట్ ప్రత్యేక రైళ్లు
విశాఖపట్నం-కృష్ణరాజపురం మధ్య వారానికి రెండుసార్లు నడిచే 26 సూపర్‌ఫాస్ట్ సువిధ స్పెషల్ రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రజాసంబంధాల అధికారి యు.ఉమా శంకర్ కుమార్ తెలిపారు. నెం.02877 రైలు విశాఖపట్నం నుంచి డిసెంబర్ 16 నుంచి జనవరి 27 వరకు ప్రతి బుధ, శనివారాల్లో 13 ట్రిప్పులు నడుపుతున్నట్లు తెలిపింది. తిరుగు ప్రయాణంలో నెం.02878 రైలు కృష్ణరాజపురం నుంచి డిసెంబర్ 17 నుంచి జనవరి 28 వరకు ప్రతి గురు, ఆదివారాల్లో 13 ట్రిప్పులు నడుపుతున్నట్లు తెలిపారు.