రాష్ట్రీయం

కేంద్రం నోటిఫికేషన్‌పై స్టేకు హైకోర్టు నిరాకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 21: ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ పరిధి నుంచి తెలంగాణను తొలగిస్తూ కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్‌పై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి రమేష్ రంగనాథన్, జస్టిస్ దుర్గాప్రసాద్‌రావు ఈ మేరకు ఆదేశాలు జారీ చేవారు. కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్‌పై స్టే ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను హైకోర్టు తిరస్కరించింది. ఈ కేసుకు సంబంధించిన అంశాలను తుది విచారణలో పరిశీలిస్తామని హైకోర్టు పేర్కొంది.

స్విస్ చాలెంజ్‌పై 25 నుంచి విచారణ
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, అక్టోబర్ 21: అమరావతి రాజధాని నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేయాలనుకున్న స్విస్ చాలెంజ్ విధానంపై సింగిల్ జడ్జి కోర్టు ఇచ్చిన స్టేపై అపీల్‌ను ఈ నెల 25వ తేదీ నుంచి స్వీకరిస్తామని హైకోర్టు ధర్మాసనం ప్రకటించింది. ఈ అంశంపై ఇప్పటికే సగం వాదనలు ముగిశాయని, వీలైనంత త్వరగా మిగిలిన వాదనలు ముగించాలని ఏపి అడ్వకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్ హైకోర్టు ధర్మాసనాన్ని కోరారు. దీంతో బుధవారం అప్పీలును స్వీకరించి వాదనలు వింటామని హైకోర్టు ప్రకటించింది.