రాష్ట్రీయం

దళితులకు వెన్నుదన్ను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 27: భారతదేశంలోనే అంబేద్కర్, జగ్జీవన్ రాం ఆలోచనావిధానాలను ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి నందమూరి తారక రామారావు అని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. గురువారం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ప్రభుత్వ దళిత, గిరిజన సంక్షేమ బాటలో భాగంగా కృష్ణాజిల్లా స్థాయిలో జరిగిన సభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. దళిత, గిరిజన, నిరుపేదల కోసం ఎన్ని మంచి పథకాలైనా పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, దానిని అందుకోవలసిన బాధ్యత ఆయా వర్గాలదేనని పేర్కొన్నారు. దళితులను ప్రోత్సహించిన వారిలో తమ ప్రభుత్వం ముందు ఉంటుందని, లోక్‌సభ స్పీకర్‌గా స్వర్గీయ బాలయోగిని, రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌గా ప్రతిభాభారతిని, ఆంధ్రప్రదేశ్‌కి చీఫ్ సెక్రటరీగా కాకి మాధవరావును ఆయా పదవుల్లో నియమించినట్లు తెలిపారు. అదేవిధంగా భారతదేశ రాష్టప్రతిగా కెఆర్ నారాయణన్ నియామకం అయే విధంగా కూడా కృషి చేశామన్నారు. కేంద్రంలోని ఎస్‌సి ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి డబ్బులు తీసుకోకుండా అనాటి ప్రభుత్వాలు నిర్లక్ష్యం ప్రదర్శించాయని, దానితో రాష్ట్రంలోని ఎస్‌సి ఫైనాన్స్ కార్పొరేషన్ మూతపడే పరిస్థితికి చేరిందన్నారు. అలా జరగకుండా ఉండడానికి రూ.8500 కోట్లతో ఎస్‌సి సబ్‌ప్లాన్ బడ్టెట్‌ను రూపకల్పన చేశామని, దళిత, గిరిజనుల్లోని పేదరికాన్ని పారద్రోలడానికి దీని ద్వారా కృషి చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ సొసైటీ 30 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా పోస్టల్ శాఖ ప్రత్యేక కవర్‌ను విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ బ్రిగేడియర్ చంద్రశేఖర్ ప్రత్యేక పోస్టర కవర్‌ను ముఖ్యమంత్రికి అందజేశారు. సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, ఎడ్యూకేషన్ సొసైటీలు సంయక్తంగా ప్రచురించిన అంకురం జర్నల్‌ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. కృష్ణాజిల్లాకు సంబంధించి 3818 మంది మహిళలకు రూ. 46.47 కోట్ల చెక్కును ముఖ్యమంత్రి అందజేశారు. అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి ద్వారా విదేశీ వెళుతున్న 60 మంది విద్యార్థులకు రూ. 6.10 కోట్ల చెక్కును ముఖ్యమంత్రి అందజేశారు.

చిత్రం.. చంద్రన్న దళిత బాట కార్యక్రమంలో మాట్లాడుతున్న చంద్రబాబు