రాష్ట్రీయం

ఇంతకీ ఆర్కే ఎక్కడ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, అక్టోబర్ 27: కాకులు దూరని కారడవిలో ఖాకీల దండయాత్ర కొనసాగుతోంది. సోమవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్ట్ అగ్రనేతలు తప్పించుకున్నారని భావిస్తున్న పోలీసులు వారి కోసం వేట మొదలుపెట్టారు. ఒక్కరు కాదు. ఇద్దరు కాదు ఏకంగా వెయ్యి మంది గ్రేహౌండ్స్, సిఆర్‌పిఎఫ్, స్పెషల్ పార్టీ పోలీసులు ఏఓబిని జల్లెడ పడుతున్నారు. తప్పించుకున్న మావోయిస్టు అగ్రనేతల కోసం అదనపు బలగాలతో, పటిష్ట వ్యూహంతో ముందుకు కదులుతున్నారు. ముఖ్యంగా ఎన్‌కౌంటర్ నుంచి అత్యంత చాకచక్యంగా తప్పించుకున్న అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ అలియాస్ ఆర్కేను లక్ష్యంగా చేసుకునే బలగాలు దూసుకుపోతున్నాయి. ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన 24మందిలో వారిలో ఆర్కే అంగ రక్షకుడు బుద్రి కూడా ఉన్నాడు. ఈయనతోపాటు మరో ఇద్దరు ఆర్కే గన్‌మెన్‌లు కూడా మరణించినట్టు పోలీసులు ధృవీకరిస్తున్నారు. ఇదే నిజమైతే ఆర్కే తప్పనిసరిగా ప్లీనరీకి హాజరై ఉండచ్చు. ఎన్‌కౌంటర్ జరిగినప్పుడు ఆర్కే ప్లీనరీలో ఉన్నారా? లేదా? అన్నది ప్రశ్నార్థకం. ఎన్‌కౌంటర్ జరిగే సమయానికి ఆర్కే ప్లీనరీకి హాజరు కాలేదన్న కథనాలు కూడా వినిపిస్తున్నాయి.
కానీ జరిగిన సంఘటనను పరిశీలిస్తే, ఆర్కే సమావేశానికి హాజరై ఉండచ్చనే కచ్చితంగా చెపుతున్నారు. చనిపోయిన వారిలో ఆర్కే అంగరక్షకులు ఉండడమే ఇందుకు నిదర్శనమని పోలీసులు అంటున్నారు. సాధారణంగా రాష్ట్ర, కేంద్ర కమిటీ నాయకులు సమావేశాలకు హాజరైనప్పుడు వారికి మూడంచెల భద్రత ఉంటుంది. అంటే కనీసం 30 నుంచి 40 మంది వరకూ సాయుధ సిబ్బంది వారిని కంటికి రెప్పలా కాపాడుతుంటారు. వారి సహకారంతోనే ఆర్కే తప్పించుకున్నారని, అదే సమయంలో ఆయన అంగరక్షకుల్లో ముగ్గురు మరణించి ఉంటారని చెబుతున్నారు. ఆర్కే సేఫ్‌గా తప్పించుకున్నారా? తీవ్ర గాయాలతో ఎక్కడైనా చికిత్స పొందుతున్నారా? అన్నది చర్చనీయాంశమైంది.
తప్పించుకోవడంలో ఆర్కే చాకచక్యం!

బెటాలియన్ల కొద్దీ పోలీసులు ఆర్కేను చుట్టుముట్టడానికి వచ్చినప్పుడు కూడా ఆయన సునాయాసంగా తప్పించుకున్న దాఖలాలు ఉన్నాయి. నల్లమల అటవీ ప్రాంతంలో ఆర్కే మూడుసార్లు పోలీసులకు చిక్కినట్టే చిక్కి తప్పించుకున్నారు. ఏఓబిలో కూడా మూడు, నాలుగుసార్లు ఆర్కే తప్పించుకున్న దాఖలాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా అదే జరిగి ఉండచ్చని కొంతమంది భావిస్తున్నారు.
పోలీసుల అదుపులో ఆర్కే?
ఆర్కే పోలీసుల అదుపులో ఉన్నారా? ఇప్పుడు ఇదే చర్చనీయాంశమైంది. ఆర్కే, గాజర్ల రవి తప్పించుకున్నారని, వారి కోసం పోలీసు వేట సాగుతున్నట్టు కనిపిస్తున్నా, వీరిద్దరూ లేదా ఆర్కే పోలీసుల అదుపులో ఉన్నారన్న వార్తలు ఇప్పుడు పోలీసులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఆర్కే తమ అదుపులో లేరని పోలీసులు ప్రకటించడం లేదు. ఆర్కేను పోలీసులు అదుపులోకి తీసుకుని ఉంటే, ఆయనను వదిలిపెట్టాలని పౌరహక్కుల సంఘం నాయకులు హరగోపాల్ డిమాండ్ చేస్తున్నారు. ఆర్కేకు ఏ హాని తలపెట్టినా టిడిపి ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని అదే సంఘాల నాయకులు హెచ్చరిస్తున్నారు. ఎన్‌కౌంటర్ జరిగిన తరువాత ఎవరెవరు మరణించిందీ,ఎవరు తప్పించుకున్నది పౌర హక్కుల సంఘాల నాయకులకు సమాచారం వస్తుంది. పౌరహక్కుల సంఘంలో కీలక నాయకులు చేస్తున్న ప్రకటనలు చూస్తుంటే, ఆర్కే పోలీసుల అదుపులో ఉన్నారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
‘శవాల’ను చూపించం:పోలీసులు
ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన మావోయిస్ట్‌ల మృతదేహాలను గుర్తుపట్టేందుకు పౌర హక్కుల సంఘం నాయకులు వరవరరావు, కళ్యాణరావు మల్కన్‌గిరి వెళ్లినప్పుడు వారికి కొన్నింటిని మాత్రమే చూపించారు. వివాదాస్పద మృతదేహాలను చూపించమని పోలీసులు చెప్పడం పలు అనుమానాలకు తావిచ్చినట్టవుతోంది. ఇందులో అగ్రనేతల మృతదేహాలు ఉన్నాయా? అన్న సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.