రాష్ట్రీయం

రాజధానికి ‘శాశ్వత’ శోభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, అక్టోబర్ 27: ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణంలో మరో అంకానికి తెరలేచింది.. సువిశాలమైన 950 ఎకరాల స్థలంలో శాశ్వత ప్రభుత్వ భవనాల నిర్మాణానికి నేడు అంకురార్పణ జరగనుంది. శాసనసభ, సచివాలయం, ముఖ్యమంత్రి, మంత్రుల కార్యాలయాలు, ప్రధాన ప్రభుత్వ కార్యాలయాలతోపాటు రిజర్వు బ్యాంక్ ప్రాంతీయ కార్యాలయానికి శుక్రవారం మధ్యాహ్నం 3.15 గంటలకు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ, ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. నిరుడు అక్టోబర్ 22న రాజధాని నగరానికి భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ భూమిపూజ చేశారు.
సింగపూర్ మాస్టర్ ప్లాన్ ప్రకారం రాజధానిలో తొమ్మిది కానె్సప్ట్ నగరాలను నిర్మించాల్సి ఉంది. ఇందుకు ప్రభుత్వం రైతుల వద్ద నుంచి 33వేల 500 ఎకరాల భూ సమీకరణ జరిపింది. ఇందులో 1691 ఎకరాల్లో వాణిజ్య నగర అభివృద్ధికి స్విస్ ఛాలెంజ్ పద్ధతిన సింగపూర్ కన్సార్టియంకు అప్పగించారు. హైకోర్టులో వాదోపవాదాల నేపథ్యంలో ప్రభుత్వం తిరిగి సవరణలతో మరోసారి టెండర్లు పిలిచే యోచనలో ఉంది. కాగా మాస్టర్ ప్లాన్ ప్రకారం 217.83 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో రాజధాని నగర అభివృద్ధి జరగాల్సి ఉంది. ఇందులో ఆర్థిక, పాలనా నగరాల నిర్మాణానికి శంకుస్థాపన జరుగుతోంది. శాసనసభ, సచివాలయంతో పాటు ఇతర ప్రభుత్వ భవనాలకు సంబంధించి ప్రభుత్వం గత ఏడాది క్రితమే గ్లోబల్ టెండర్లను ఆహ్వానించింది. మొత్తం ఐదు ప్రపంచ ప్రసిద్ధ సంస్థలు డిజైన్లు సమర్పించాయి. వీటిలో జపాన్‌కు చెందిన మాకీ అసోసియేట్స్ రూపొందించిన డిజైన్లను ప్రభుత్వం ఆమోదించింది. అయితే దశాబ్దాల క్రితమే ఈ డిజైన్‌ను చత్తీస్‌గఢ్ రాజధానికి రూపొందించారని, ఈ ప్రాంత చారిత్రక, సాంస్కృతిక ప్రాశస్త్యానికి తగ్గట్టుగా లేవనే విమర్శలు రావటంతో మాకీ అసోసియేట్స్‌తో ఒప్పందాన్ని రద్దుచేసుకుంది. శాశ్వత ప్రభుత్వ భవనాలు తుళ్లూరు మండలంలోని రాజధాని ప్రతిపాదిత రాయపూడి, లింగాయపాలెం గ్రామాల్లో నిర్మించనున్నారు. కాగా నిర్మాణ డిజైన్లకు మరోసారి గ్లోబల్ టెండర్లను ఆహ్వానించాలని ప్రభుత్వం భావిస్తోంది. వాస్తు, సంప్రదాయక పద్ధతిలో ఉండే డిజైన్లకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించింది. డిజైన్లు ఖరారయ్యాక ఇపిసి (ఇంజనీరింగ్ ప్రొక్యూర్‌మెంట్ అండ్ కనస్ట్రక్షన్స్) పద్ధతిన నిర్మాణాలకు టెండర్లను ఆహ్వానించనున్నట్లు సీఆర్డియే అధికారులు తెలిపారు. కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ శుక్రవారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నుంటి ప్రత్యేక విమానంలో బయల్దేరి 11.40 గంటలకు విజయవాడ చేరుకుంటారు. స్థానికంగా పార్టీనేతలతో సమావేశమవుతారు. అనంతరం మధ్యాహ్నం మూడు గంటలకు తుళ్లూరులో భూమిపూజకు హాజరవుతారు. శాశ్వత భవనాలను 2018 నాటికి పూర్తిచేసే విధంగా సీఆర్డీయే అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు. నెలవారీ చేపట్టాల్సిన పనుల వివరాలను సిద్ధం చేస్తున్నారు. ఇదిలా ఉండగా శంకుస్థాపన కార్యక్రమానికి 40వేల మంది వరకు హాజరుకానున్నట్లు అంచనా వేస్తున్నారు. సుమారు 20 ఎకరాల స్థలంలో వేదిక ఏర్పాటయింది.

రాజధానిలో అరుణ్ జైట్లీ శంకుస్థాపన చేయనున్న నూతన భవనాల నమూనా