రాష్ట్రీయం

ఆందోళన ఉద్ధృతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 27: ఉద్యోగ భద్రత, వేతనాల పెంపును కోరుతూ కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్న హోంగార్డులు ఉద్యమాన్ని ఉద్ధృతం చేశారు. గురువారం తెలంగాణ సచివాలయం ముట్టడికి యత్నించారు. ఇందిరాపార్కు నుంచి భారీ ర్యాలీగా వచ్చిన హోంగార్డులు ఒక్కసారిగా సచివాలయంలోకి దూసుకెళ్ళేందుకు యత్నించారు. ఈ హఠాత్పరిణామాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారంతా సచివాలయం గేటు వద్ద బైఠాయించి నిరశనకు దిగడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈమేరకు హోంగార్డుల ప్రతినిధులు సచివాలయంలో సిఎస్‌తో కలసి చర్చలు జరిపారు. చర్చలు విఫలమవ్వడంతో బయటకు వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఒక హోంగార్డు పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేశారు. మరో మహిళా హోంగార్డు అలసటతో స్పృహ తప్పి పడిపోయారు. ఆందోళనకారుల్ని చెదరగొట్టేందుకు పోలీసులు స్వల్పంగా లాఠీచార్జి చేశారు. హోంగార్డులు ఆందోళన విరమించాలని, పరిధి దాటితే కుటుంబాలు వీధిన పడతాయని సెంట్రల్ జోన్ డిసిపి డేవిస్ జోయల్ హెచ్చరించారు. అయితే సమస్యలు పరిష్కరించేంత వరకూ తమ ఆందోళన కొనసాగుతుందని హోంగార్డుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సకినాల నారాయణ స్పష్టం చేశారు. సచివాలయం ఎదుట మూడు గంటలపాటు సాగిన ఆందోళనతో డైరెక్టర్ జనరల్ తేజ్‌దీప్ కౌర్ దిగివచ్చి, హోంగార్డుల సంఘం ప్రతినిధులతో చర్చలు జరిపేందుకు యత్నించారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, జీతభత్యాలు పెంచాలని వారు డిమాండ్ చేశారు. ఇదిలావుండగా హోంగార్డుల సంఘం ప్రతినిధులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర అధికారులతో జరిపిన చర్చల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం హోంగార్డుల సమస్యలు పరిష్కరించేందుకు సుముఖతతో ఉందని, హోంగార్డులకు భారీ రెమ్యూనరేషన్ చెల్లించేందుకు సిద్ధంగా ఉందని డిజిపి అనురాగ్ శర్మ తెలిపారు. ఇప్పటికే హోంగార్డులకు ప్రమాద బీమా కింద రూ. 5 లక్షలు, ఉగ్రవాదులు, తీవ్రవాదుల దాడుల్లో మృతి చెందిన హోంగార్డులకు రూ. 30 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించేందుకు ప్రభుత్వం నిశ్చయించిందన్నారు. హోంగార్డుల సర్వీసు క్రమబద్ధీకరణ, వేతనాల పెంపుపై ముఖ్యమంత్రి చర్చిస్తున్నారని పేర్కొన్నారు.

చిత్రం.. గురువారం సచివాలయం ఎదుట ఆందోళనకు దిగిన హోంగార్డులు