రాష్ట్రీయం

సర్దుకుపోదాం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 27:కొత్త సచివాలయ భవనాల నిర్మాణంలో భాగంగా ప్రస్తుతం అక్కడ నడుస్తున్న కార్యాలయాలను వేరే చోటకు తరలించాలన్న ప్రతిపాదనపై ప్రభుత్వం పునరాలోచన పడింది. సచివాలయంలో ఏపి భవనాలను తెలంగాణకు అప్పగించే పక్షంలో తమ కార్యాలయాలను తాత్కాలికంగా వాటిలోకి మార్చి, ఆ తరువాతే కూల్చివేతలు చేపట్టడం ఉత్తమమని ఇంజనీరింగ్ నిపుణులు తాజాగా ప్రభుత్వానికి సిఫారసు చేసినట్టు తెలిసింది. ఇలా చేయడం వల్ల కార్యాలయాల తరలింపు సులువు అవటంతోపాటు ఖర్చు కూడా కలిసొస్తుందని ఇంజనీరింగ్ నిపుణులు ప్రభుత్వానికి నివేదించారు. తమ భవనాలను తమకు అప్పగించే అంశంపై ఏపి ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకు వేచి చూసిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ సర్కార్ తాజాగా నిర్ణయించినట్టు అధికారవర్గాల సమాచారం. వాస్తవానికి తెలంగాణ సచివాలయ భవనాల్లో కొనసాగుతున్న కార్యాలయాలను తరలించడానికి బిఆర్‌కె భవన్‌సహా ఆరు భవనాలను ప్రభుత్వం దాదాపు ఖరారు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇతర చోట్లకు కార్యాలయాలను తరలించడం వల్ల కొంతకాలంపాటు ప్రభుత్వ కార్యకలాపాలు స్తంభిస్తాయని, అలాగే తాత్కాలిక కార్యాలయాల మరమ్మతులకు పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చవుతుందని ఇంజనీరింగ్ నిపుణులు తమ నివేదికలో అభిప్రాయపడినట్టు తెలిసింది. పైగా ఇతర చోట్లకు తరలించడం వల్ల ఏ కార్యాలయం ఎక్కడుందో తెలుసుకోవడం ప్రజలకు ఇబ్బందికరంగా మారుతుందని కూడా నివేదికలో సూచించినట్టు తెలిసింది. ప్రస్తుత సచివాలయం కూల్చివేతతో పాటు ఇందులోని కార్యాలయాలను ఇతర చోట్లకు తరలించే అంశంపై రోడ్లు భవనాల శాఖ నుంచి ప్రభుత్వం నివేదిక కోరింది. ఈ మేరకు అధ్యయనం చేసి సమర్పించిన నివేదికలో కార్యాలయాల తాత్కాలిక తరలింపును సచివాలయం వెలుపల కాకుండా సచివాలయంలోనే ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన భవనాల్లోకి తరలించడం ఉత్తమమని ఆర్ అండ్ బి శాఖ సిఫారసు చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేటాయించిన భవనాలకు ఆ ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులు ఖర్చు చేసి మరమ్మత్తులు చేసిందని, ముఖ్యమంత్రి కార్యాలయం, మంత్రుల చాంబర్లకు దాదాపు రూ. 25 కోట్లు ఖర్చు చేసిన విషయాన్ని ఆర్ అండ్ బి శాఖ తన నివేదికలో గుర్తు చేసింది. ఆర్ అండ్ బి చేసిన సిఫారసు పట్ల తెలంగాణ ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉన్నట్టు తెలిసింది.