రాష్ట్రీయం

‘తమిళ’ తరహాలో రిజర్వేషన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 27: తమిళనాడు తరహాలో వెనుకబడిన తరగతులకు రాష్ట్రంలో రిజర్వేషన్లు పెంచడానికి అధ్యయనం చేయాల్సిందిగా బిసి కమిషన్‌ను ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశించారు. కమిషన్ చేసే సిఫారసుల మేరకు రాష్ట్రంలో రిజర్వేషన్లు పెంచాలంటూ శాసనసభలో తీర్మానం చేసి కేంద్రాన్ని కోరుదామని ముఖ్యమంత్రి సూచించారు. బిసి కమిషన్ చైర్మన్ బిఎస్ రాములు, సభ్యులు వకుళాభరణం కృష్ణమోహన్, జూలూరి గౌరిశంకర్, ఆంజనేయగౌడ్ గురువారం పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బిసి కమిషన్ చేయాల్సిన పనులు, బిసి కులాల అభ్యున్నతికి తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి మార్గదర్శకం చేశారు. తెలంగాణలో 80 శాతం బలహీన వర్గాల ప్రజలు ఉన్నారని, వారి జీవన పరిస్థితుల్ని మెరుగు పరిచేందుకు రిజర్వేషన్ల శాతాన్ని పెంచాల్సిన అవసరం ఉందని సిఎం అభిప్రాయపడ్డారు. తమిళనాడులో అక్కడి జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు పెంచుకుందన్నారు. వాటికి పార్లమెంట్ కూడా ఆమోదం తెలపడంతో 9వ షెడ్యూల్‌లో చేర్చినట్టుగానే రాష్ట్రంలో రిజర్వేషన్లను పెంచుదామని ముఖ్యమంత్రి అన్నారు. అలాగే రాష్ట్రంలో ముస్లింల జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు పెంచేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, దీనిపై అధ్యయనం చేసిన సుధీర్ కమిటీ ప్రభుత్వానికి నివేదిక అందజేసిందన్నారు. సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన కులాలకు రిజర్వేషన్లు ఇచ్చే విషయంలో బిసి కమిషన్ సిఫారసులు చేయాల్సి ఉంటుందన్నారు. బిసిలలో అనేక కులాలు ఉన్నాయని, కొన్ని కులాలు కుల వృత్తుల ద్వారా ఉపాధి పొందుతుండగా, మరికొన్ని కులాలు మాత్రం కుల వృత్తులు అంతరించిపోయి దిక్కుతోచని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ పరిస్థితి పోవడానికి బిసి కమిషన్ అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి అన్నారు.