రాష్ట్రీయం

‘అబ్జర్వేటరీ’పై సర్కారు కన్ను!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 27: ఉస్మానియా విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మరో పక్క ఉస్మానియా యూనివర్శిటీకి చెందిన 24 ఎకరాల భూమిపై కనే్నసింది. పంజాగుట్ట చౌరాస్తా నుండి అమీర్‌పేటకు వెళ్లే దారిలో ఉన్న నిజామియా అబ్జర్వేటరీ ఉస్మానియా యూనివర్శిటీకి చెందిందే. ఆ సంస్థ ఉన్న స్థలాన్ని దక్కించుకునేందుకు రాష్ట్రప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నాలు ప్రారంభిస్తున్నట్టు ఉస్మానియా యూనివర్శిటీకి చెందిన విద్యార్థులు, అధ్యాపకులు చెబుతున్నారు. వందేళ్ల చరిత్ర ఉన్న ఈ స్థలాన్ని కాపాడి ఉస్మానియా యూనివర్శిటీకి అప్పగించాల్సిన ప్రభుత్వం అందుకు భిన్నంగా కబ్జా చేసేందుకు ప్రయత్నించడం దారుణమని అంటున్నారు.
ఈ సందర్భంగా ఉస్మానియా అబ్జర్వేటరీ గత చరిత్రను ఔటా అధ్యక్షుడు ప్రొఫెసర్ బి సత్యనారాయణ, రిటైర్డ్ టీచర్సు అసోసియేషన్ అధ్యక్షుడు ప్రొఫెసర్ డి మనోహరరావు వివరించారు. 1908లో ఉస్మానియా యూనివర్శిటీ పరిధిలోనే ఈ నక్షత్ర వేధశాలను ప్రారంభించారని వారు వివరించారు. 1908లో అప్పటి అంతరిక్ష పరిశోధకుడు జాఫర్ జంగ్ బహుదూర్ ఇంగ్లాండ్ నుండి రెండు టెలిస్కోప్‌లను తీసుకువచ్చి 24 ఎకరాల సువిశాల స్థలంలో వాటిని నెలకొల్పారు.
ఒకటి 15 అంగుళాల వ్యాసార్ధం ఉండే గ్రుబ్ టెలిస్కోప్‌గా, మరొకటి 8 అంగుళాల కూక్ ఆస్ట్రోగ్రాఫ్‌గా వ్యవహరించేవారు. తర్వాత దానిని నిజామియా అబ్జర్వేటరీగా నామకరణం చేశారు. భారతదేశంలో ఏర్పాటు చేసిన తొలి నక్షత్ర వేధశాలల్లో ఇదొకటని వారు చెప్పారు. 1918 వరకూ నక్షత్ర వేధశాల ఉస్మానియా యూనివర్శిటీకి అనుబంధంగా ఉండేదని, 1923లో మరికొన్ని టెలిస్కోప్‌లు దాంట్లో చేరాయని, 1939 నాటికి దాదాపు 2.93 లక్షల నక్షత్రాలను గుర్తించడం జరిగిందని అన్నారు. డాక్టర్ వేణుబాబు కమిటీ సిఫార్సులకు విరుద్ధంగా 1983లో నక్షత్ర వేధశాలను ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్‌లోకి మార్చారని, కాని అపుడు నిర్మించిన అతి పెద్ద గుమ్మటాలు అలాగే ఉన్నాయని, దాంట్లోనే యూనివర్శిటీకి చెందిన జెనిటిక్స్ డిపార్టుమెంట్ నిర్వహిస్తున్నారని వారు చెప్పారు. అలాగే సెంటర్ ఫర్ ఎకనామిక్ సోషల్ స్టడీస్ కూడా ఏర్పాటైందని, విశాలమైన వృక్షాలతో అందంగా ఉన్న ఈ క్యాంపస్‌పై ప్రభుత్వం కనే్నసిందని వారు పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆ స్థలాన్ని సురక్షితంగా ఉస్మానియా యూనివర్శిటీకి అప్పగించాలని వారు డిమాండ్ చేశారు. కాగా దీనిపై ఫిర్యాదు చేసేందుకు సైతం సిబ్బంది భయపడుతున్నట్టు తెలిసింది. కాగా ప్రభుత్వం సానుకూలంగా స్పందించకుంటే తాము న్యాయస్థానంలోనే తేల్చుకోవల్సి వస్తుందని ఔటా నేతలు హెచ్చరించారు.