రాష్ట్రీయం

సచివాలయం కూల్చివేత సరికాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 27: తెలంగాణ రాష్ట్ర సచివాలయాన్ని కూల్చివేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి దాఖలు చేసిన పిల్‌ను విచారణకు హైకోర్టు గురువారం స్వీకరించింది. ప్రస్తుతం ఉన్న సచివాలయాన్ని కూల్చివేసి కొత్త సచివాలయం భవనాలను నిర్మించాలన్న ప్రభుత్వ నిర్ణయం హేతుబద్ధం కాదని పిల్‌లో పిటిషనర్ పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్, జస్టిస్ ఏ శంకర్ నారాయణతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ పిటిషన్‌ను శుక్రవారం విచారిస్తామని ధర్మాసనం పేర్కొంది. పిటిషనర్ తరఫున న్యాయవాది ఎస్ సత్యం రెడ్డి వాదనలు వినిపిస్తూ పిల్‌ను ప్రస్తావించారు. వాస్తు ఇతర సెంటిమెంట్ల ప్రాతిపదికన సచివాలయాన్ని కూల్చి కొత్త సచివాలయాన్ని నిర్మించాలన్న ప్రతిపాదన సరికాదని ఆయన కోర్టుకు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత వాస్తు పేరిట కొత్త గేటు పెట్టడం, ఇతర నిర్మాణాలకు ప్రభుత్వం పెద్ద ఎత్తున సొమ్మును ఖర్చుపెట్టిందన్నారు. సచివాలయం భవనాలను కూల్చి కొత్త భవనాలను నిర్మించడం వల్ల ఖజానాపై భారం పడుతుందన్నారు. అనంతరం ఈ కేసు విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు.