రాష్ట్రీయం

మావోల లేఖ వెనుక రాజకీయ కోణం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, అక్టోబర్ 27: ఏవోబీ ఎన్‌కౌంటర్ నేపథ్యంలో మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి పేరిట విడుదలయిన లేఖ నకిలీదేనన్న అనుమానం పెరుగుతోంది. మావోయిస్టు పార్టీ సానుభూతి సంస్థగా పేరున్న ఏపిసిఎల్‌సి నేత కల్యాణరావు వ్యాఖ్యలు పరిశీలిస్తే ఆ లేఖ మావోలది కాదని నిర్ధారణ అయిన క్రమంలో, అన్ని వర్గాల చూపులు రాజకీయ కోణం వైపు మళ్లుతున్నాయి. ఆత్మాహుతి పదజాలం, ఆలోచన మావో సిద్ధాంతానికి పూర్తి వ్యతిరేకమని, ‘పోరాడు-చంపు-చావు’ సిద్ధాంతమే తప్ప ఆత్మాహుతి అనేది పిరికితనంతో కూడిన ప్రక్రియ అన్నది మావోల వాదన. దీనిపై గత పదిహేనేళ్ల క్రితం పార్టీలో చర్చ కూడా జరిగినట్లు చెబుతున్నారు. ఆ సందర్భంలో ఆత్మాహుతి విధానంపై చర్చ జరిగిన నేపథ్యంలో దానిని అగ్రనేతలు తీవ్రంగా వ్యతిరేకించి అది పిరికిపందల చర్యగా అభివర్ణించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. తాజాగా పౌరహక్కుల సంఘం నేత కల్యాణరావు కూడా అలాంటి భాష, ఆలోచన మావోయిస్టులది కాదని స్పష్టం చేశారు.
అయితే, ఆ లేఖ వెనుక డిజిపి సాంబశివరావు, సీఎం చంద్రబాబు ఉన్నారని కల్యాణరావు ఆరోపించినప్పటికీ దానికి వేరే కోణం ఉందని విశే్లషిస్తున్నారు. అయితే, తాజా లేఖలో బాబు-లోకేష్‌ను లక్ష్యంగా చేసుకుని, కావాలని అల్లిన కథగా అనిపిస్తోందన్న అనుమానాలు అటు పోలీసు, తెదేపా, రాజకీయ విశే్లషకుల నుంచి వ్యక్తమవుతున్నాయి. నిజంగా మావోలు లేఖ రాసినట్టయితే అందులో ఒక్క ఏపి మాత్రమే కాకుండా తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా లక్ష్యంగా చేసుకున్నట్లు ఉండాలని, కానీ అది లేకపోవడం బట్టి ఇది రాజకీయ కోణంలో తెదేపా ప్రత్యర్ధి వర్గాలు పంపిన లేఖ కూడా కావచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణకు చెందిన మావోలు కూడా చాలామంది మృతి చెందారని చెబుతున్నప్పటికీ ఇప్పటివరకూ ప్రభాకర్, దయ, లతను మాత్రమే గుర్తించి వారి అంత్యక్రియలు నిర్వహించారు. అదేవిధంగా ఒడిశాకు చెందిన మావోలూ మృతి చెందారు. లేఖ నిజంగా మావోలు రాసినట్టయితే బాబు ఆయన తనయుడు లోకేష్‌ను లక్ష్యంగా చేసుకున్నట్టే తెలంగాణలో సీఎం కేసీఆర్, ఆయన తనయుడు కేటీఆర్‌తోపాటు, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ పేర్లు కూడా ప్రస్తావించి ఉండాలని విశే్లషిస్తున్నారు. ఇదే అనుమానాలు, వాదనలు తెదేపా వర్గాల్లోనూ వినిపిస్తున్నాయి. కల్యాణరావు చెప్పినట్లు ఆ లేఖ వెనుక బాబు ఉంటే, అందులో తనతోపాటు కొడుకు పేరును ఎందుకు ప్రస్తావిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ అదనపు భద్రత కోసమే అయితే ఇప్పటికే లోకేష్‌కు తగినంత భద్రత, బుల్లెట్‌ప్రూఫ్ కారు ఉందని, బాబుకు జడ్ ప్లస్‌తోపాటు రాష్ట్ర పోలీసు భద్రత కూడా ఉందని గుర్తు చేస్తున్నారు. నిజానికి రాజకీయనేతలకు భద్రత పెంచడమంటే ఒకరకంగా ప్రజలకు దూరం చేయడమేనని, నేతలు దూరంగా ఉంటే ప్రజలు కూడా వారిని దూరం పెడతారని బహుశా ఇదే రాజకీయ ఎత్తుగడతో కూడా ఆ లేఖలో బాబు-లోకేష్ పేర్లు ప్రస్తావించి ఉండవచ్చంటున్నారు.
ప్రత్యేకించి లోకేష్ పేరు ప్రస్తావించటమే తమ అనుమానాలకు కారణమని, లోకేష్‌ను టార్గెట్ చేశామని చెప్పటం ద్వారా, బాబును భయపెట్టి లోకేష్‌ను పార్టీ-ప్రభుత్వానికి దూరంగా ఉంచే రాజకీయ ఎత్తుగడ కూడా కావచ్చని తెదేపా నేతలు భావిస్తున్నారు. కేసీఆర్, నవీన్ పట్నాయక్, కేటీఆర్ ప్రస్తావన లేనందునే అది రాజకీయ కోణంలో రాజకీయ ప్రత్యర్థులు రాసిన లేఖ కూడా అయి ఉండవచ్చని అనుమానించాల్సి వస్తోందంటున్నారు. ఇటీవలి కాలంలో లోకేష్ తరచూ రాజకీయ ప్రత్యర్థులకు లక్ష్యమవుతున్న నేపథ్యంలో, ఇప్పుడు మావోల పేరిట వచ్చిన లేఖలో కూడా లోకేష్ పేరు ఉండటాన్ని తమ అనుమానాలకు మద్దతుగా వాదిస్తున్నారు. లోకేష్ ప్రభుత్వంలో ఎలాంటి హోదాలో లేరని, సహజంగా అందరు సీఎంల కొడుకుల మాదిరిగానే ఆయన కూడా పార్టీ, ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారాలు చూస్తున్నారని విశే్లషిస్తున్నారు. అలాంటప్పుడు లోకేష్‌ను టార్గెట్‌గా చేయడం బట్టి ఆ లేఖ వెనుక విస్తృత రాజకీయ ప్రయోజనాలున్నట్లు పార్టీ వర్గాలతోపాటు, పోలీసు వర్గాలు కూడా అనుమానిస్తున్నాయి. తెలంగాణకు సంబంధించి ఇప్పటికి ముగ్గురు మావోల పేర్లు అధికారికంగా బయటకు వచ్చినా, మావోయిస్టు పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధి జగన్ నుంచి ఇప్పటివరకూ ఎలాంటి ప్రకటన వెలువడని వైనాన్ని గుర్తు చేస్తున్నారు.