ఆంధ్రప్రదేశ్‌

ఎఒబిలో ఆగని తుపాకీల మోత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాడేరు, అక్టోబర్ 27: ఎఒబి ప్రాంతంలో పోలీసుల తుపాకుల మోత ఆగలేదు. ఈ ప్రాంతంలో వరుస ఎన్‌కౌంటర్లతో మావోయిస్టులను మట్టుబెడుతున్న పోలీస్ బలగాలు తాజాగా గురువారం జరిగిన మరో ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. ఎఒబిని ఆనుకుని ఉన్న ముంచంగిపుట్టు మండలం కుమడ పంచాయతీ సిర్లిమెట్ట గ్రామ సమీపాన అటవీ ప్రాంతంలో చోటుచేసుకున్న ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన మావోలలో పెదబయలు ఏరియా కమిటి కార్యదర్శి, జిల్లా కమిటీ సభ్యుడు కిరణ్ (సువర్ణరాజు)తో పాటు మావోల వైద్యుడు అశోక్ ఉన్నట్టు తెలుస్తోంది. కొండలమీదుగా వెళ్తున్న మావోయిస్టులను పోలీసు బలగాలు గుర్తించి కాల్పులు జరపడంతో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. మృతి చెందిన మావోల వద్ద 303, ఎస్.ఎల్.ఆర్. తుపాకులతో పాటు కొన్ని మందులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 24న జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో గాయపడిన మావోయిస్టులకు వీరు మందులు తీసుకెళ్తున్నట్టుగా భావిస్తున్నారు. అయితే ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలను హెలికాఫ్టర్ ద్వారా పాడేరు తరలించారు. పాడేరులోని ఏరియా ఆసుపత్రిలో వీరి మృతదేహాలను భద్రపరిచిన పోలీసులు వీరి వివరాలను వెల్లడించేందుకు నిరాకరిస్తున్నారు. ఈ సంఘటనతో ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన మావోల సంఖ్య 30కు చేరింది.

చిత్రం.. గురువారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన మావోయిస్టులు