రాష్ట్రీయం

మాజీల గుండెల్లో రైళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, అక్టోబర్ 27: మావోయిస్టుల్లో అంతర్మథనం చోటు చేసుకుందా.. అంబుజ్‌మడ్ ఆపరేషన్ గ్రీన్‌హంట్‌లో భాగంగా ఏడాది పూర్తికాకుండానే ఇప్పటి వరకు 110 మంది సాయుధ మావోయిస్టులు చనిపోయారు. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో ఇప్పటి వరకు రెండు సార్లు కెకెడబ్ల్యు కమిటీని భద్రతా బలగాలు ఎన్‌కౌంటర్‌లో చంపేశాయి. అటు వైపు ఏఓబిలోనైనా పార్టీ పటిష్టంగా ఉందా? అంటే ఇటీవల జరిగిన వరుస ఎన్‌కౌంటర్లలో 32 మంది మావోయిస్టులు చనిపోయారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న జాయింట్ ఆపరేషన్లలో మావోయిస్టు పార్టీ ఆత్మరక్షణలో పడిందని విశే్లషకులు అంచనా వేస్తున్నారు. మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి పేరుతో బుధవారం విడుదలైన లేఖ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. ఆత్మాహుతి దాడులకు పాల్పడతామని మావోయిస్టు పార్టీ నుంచి ఎప్పుడూ రాని మాట వచ్చిందంటే ఆ పార్టీ నాయకత్వం తీవ్రమైన అంతర్మథనం చెందుతోందని స్పష్టమవుతోంది. ఉద్యమ పయనంలో ఎన్నో ఆటుపోట్లను చూసిన మావోయిస్టు పార్టీ తమ శత్రువులను వ్యూహాత్మకంగా తుదముట్టిస్తూ వచ్చింది. ఎన్నో ఎదురుదెబ్బలను తట్టుకుని ముందడుగు వేసింది. అంతటి ఊపులో కూడా ఏనాడూ ఇలాంటి ప్రకటన చేయలేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. నిజంగానే మావోయిస్టులు ఆత్మాహుతి దాడులకు పాల్పడతారా? అనే అంశంపై ఇపుడు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. అయితే కల్యాణరావు ఈ వ్యాఖ్యలను ఖండించారు. ఇది మావోయిస్టుల లేఖే కాదని, బూటకపు లేఖని ఆయన పేర్కొన్నారు. అయినా దీనిపై ప్రభుత్వాలు విశే్లషణలు చేస్తూనే ఉన్నాయి. ఆత్మాహుతి దాడి అనే వ్యాఖ్య తీవ్రమైనదని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలకు చెందిన వర్గాలు పేర్కొంటున్నాయి. ఏనాడైనా మావోయిస్టులు ఆత్మాహుతి దాడులకు పాల్పడే అవకాశాలు ఉన్నాయని గతంలోనే పలుమార్లు నిఘా వర్గాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదించాయి. దక్షిణాసియా మావోయిస్టు పార్టీలు, సంస్థల సమన్వయ కమిటీ(సిసిఓఎంపిఓఎస్‌ఏ) అనే ఈ గ్రూపులో నేపాల్ మావోలు ఉన్నారని కేంద్ర హోంశాఖ హెచ్చరించింది. ఫిలిప్పీన్స్, టర్కీ లాంటి దేశాల్లోని మావోయిస్టు సంస్థలతో భారతదేశ మావోయిస్టులకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఆ నివేదికలో వెల్లడించారు. అయితే 14 రాష్ట్రాలు, నేపాల్ వరకు విస్తరించిన విప్లవకారిడార్‌కు కేంద్రమైన ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలోని అంబుజ్‌మడ్ పర్వత శ్రేణుల్లో 1980 ప్రాంతంలో ఎల్టీటీఈ వంటి సంస్థలు కూడా శిక్షణ పొందినట్లు గతంలో నిఘా వర్గాలు వెల్లడించాయి. ఏడాది క్రితం నేపాల్ మావోయిస్టులకు ఇక్కడే శిక్షణ ఇచ్చినట్లు పేర్కొన్నాయి.
చత్తీస్‌గఢ్ సిఎం గతంలో పలుమార్లు మావోయిస్టులకు ఉగ్రవాదులు, ఐఎస్‌ఐతో సంబంధాలు ఉన్నాయని ప్రకటించారు. ఆర్డీఎక్స్, అత్యాధునిక ఆయుధాల వాడకంలో దిట్ట అయిన ఐఎస్‌ఐ తీవ్రవాదులు ఆత్మాహుతి దాడులకు వెనకాడరని వారితో చెలిమి చేస్తున్న మావోయిస్టులు మున్ముందు ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని ఆయన గతంలో వ్యాఖ్యానించారు. మావోయిస్టు పార్టీ చేసిన తీవ్రమైన వ్యాఖ్యల నేపథ్యంలో ప్రజాప్రతినిధులు, మంత్రులు, మాజీ నక్సల్స్ గుండెల్లో దడ మొదలైంది. తమకు ఏదైనా నష్టం వాటిల్లినప్పుడు మావోయిస్టు పార్టీ ఆ ఘటనపై పోస్టుమార్టం నిర్వహిస్తుంది. ఈ ఘటన ఎలా జరిగింది? లోపం ఎక్కడ? అని విశే్లషించుకుంటుంది. దానిలో భాగంగానే ఏఓబి ఎన్‌కౌంటర్ నేపథ్యంలో మావోయిస్టు పార్టీ లొంగిన నక్సల్స్ ఉప్పందించడం, ప్రభుత్వానికి సహకరించడం వల్లనే ఇంతటి అనర్ధం జరిగిందని ఒక అవగాహనకు వచ్చింది.