రాష్ట్రీయం

ఆయిల్‌ఫెడ్‌కు మూడు కోట్లు సోయా కొనుగోలుకు చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 8: రాష్ట్రంలో రైతుల నుండి సోయాబీన్ కొనుగోలు చేసేందుకు సెంట్రల్ మార్కెట్ ఫండ్ నుండి మూడుకోట్ల రూపాయలు ఆయిల్‌ఫెడ్‌కు (తెలంగాణ స్టేట్ కో-ఆపరేటివ్ ఆయిల్‌సీడ్స్ గ్రోయర్స్ ఫెడరేషన్) ప్రభుత్వం కేటాయించింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ కార్యదర్శి సి. పార్థసారథి పేరుతో మంగళవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ నిధులను మంజూరు అయిన ఆరు నెలల్లోగా ఆయిల్‌ఫెడ్ తిరిగి సెంట్రల్ మార్కెట్ ఫండ్‌కు జమచేయాలని షరతు విధించారు. వ్యవసాయ మార్కెటింగ్ డైరెక్టర్, ఆయిల్‌ఫెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఈ అంశంలో అవసరమైన చర్యలు తీసుకోవాలని పార్థసారథి సూచించారు.