ఆంధ్రప్రదేశ్‌

పిఎస్‌ఎల్‌వి-సి 36 ప్రయోగం త్వరలో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, నవంబర్ 14: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ప్రయోగానికి సన్నద్ధమవుతోంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుండి ఈ నెలాఖరులో పిఎస్‌ఎల్‌వి-సి 36 ప్రయోగానికి శాస్తవ్రేత్తలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ప్రయోగంపై ఇస్రో చైర్మన్ ఎఎస్.కిరణ్‌కుమార్ సోమవారం బెంగళూరు నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా షార్‌లోని కల్పన అతిథి గృహంలో ఉన్న శాస్తవ్రేత్తలతో చర్చించారు.
ఇప్పటికే రాకెట్ రెండు దశల అనుసంధాన పనులు పూర్తయి, మూడో దశ అనుసంధాన పనులను శాస్తవ్రేత్తలు శరవేగంగా చేస్తున్నారు. ఈ రాకెట్ ద్వారా నింగిలోకి పంపే మన దేశానికి చెందిన ప్రధాన ఉపగ్రహం రిసోర్స్ శాట్-2ఎ రెండు రోజుల క్రితం షార్‌కు చేరింది. ఈ నెల 28న ప్రయోగించేందుకు ఇస్రో సన్నాహం చేస్తోంది.
ఈ ఉపగ్రహంతో పాటు మన దేశ విద్యార్థులు రూపొందించిన రెండు చిన్న ఉపగ్రహాలు, మరో రెండు విదేశీ ఉపగ్రహాలను ఒకేసారి కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు. మూడో దశ అనుసంధాన పనుల్లో రాకెట్ భాగంలో చిన్నపాటి సాంకేతిక లోపం తలెత్తినట్లు తెలిసింది.
ఈ లోపాన్ని శాస్తవ్రేత్తలు సరిచేస్తే ఈ నెల 28న లేకుంటే డిసెంబర్ మొదటి వారంలో ప్రయోగించేందుకు శాస్తవ్రేత్తలు సన్నాహాలు చేస్తున్నారు.