రాష్ట్రీయం

ఇంకా అదే.. వరస!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 15: కేంద్ర ప్రభుత్వం రూ. 500, వెయ్యి నోట్లను రద్దు చేసి వారం దాటుతున్న ప్రజల కష్టాల్లో మార్పులేదు. సోమవారం బ్యాంకులకు సెలవు కావటంతో మంగళవారం బ్యాంకులు, పోస్ట్ఫాసులు, ఎటిఎం సెంటర్లకు ప్రజలు ఎగబడ్డారు. మోదీ నిర్ణయం తీసుకుని వారం దాటుతుంది కనుక, నగదు మార్పిడి పరిస్థతిలో మార్పు ఉండొచ్చని ఆశించిన జనానికి నిరాశే ఎదురైంది. బ్యాంకులు, పోస్టాఫీసులు తెరవడానికి రెండు గంటల ముందునుంచే జనం క్యూగట్టారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఒక చేతిలో ధృవీకరణ పత్రం, మరో చేతిలో వాటర్ బాటిల్‌తో కొందరు వస్తుంటే, వయసు మళ్లిన వారు, బిపి, షుగర్ వంటివి ఉన్నవారు జేబుల్లో బిస్కట్ ప్యాకెట్లు పెట్టుకుని బ్యాంకుల వద్ద పడిగాపులు కాస్తున్నారు. కొన్ని బ్యాంకుల వద్ద అధికారులు షామియానాలు కూడా వేయించారు. శాంతిభద్రతలు, ట్రాఫిక్ పోలీసులు బ్యాంకుల వద్ద బందోబస్తుకు నిలబడి ప్రజలను ‘క్యూ’లో నిలబెట్టారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో స్పష్టమవుతున్నది. కాగా నోట్ల మార్పిడికి వచ్చే నెల ఆఖరు వరకు గడువు ఉన్నా, కేంద్రం ఏ క్షణంలోనైనా గడువును కుదించే ప్రమాదం ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఈ వదంతులతో ప్రజల్లో ఆందోళన మరింత పెరిగింది.
కొత్త 500 నోట్లు ఏవీ?
మంగళవారం ఉదయం నుంచే కొత్త 500 నోట్లు అందుబాటులోకి రానునట్లు కేంద్రం, ఆర్‌బిఐ ప్రకటించినా, ప్రజల చేతుల్లోకి మాత్రం చేరనే లేదు. ఏటిఎంల సాఫ్ట్‌వేర్‌ను మార్చాల్సి ఉండటంతో రూ.500 నోట్లు ఏటిఎంలలోకి చేర్చటానికి మరింత సమయం పట్టేలా ఉందని అంటున్నారు. 2వేల రూపాయల నోటు డ్రా చేసినా దుకాణదారుల వద్ద దానికి సరిపడా చిల్లర లేకపోవడంతో వినియోగదారుల ఇబ్బందులు తొలగలేదు. పైగా ఏటిఎంల నుంచి కేవలం రెండున్నర వేల రూపాయలే డ్రా చేయాల్సిన పరిస్థితి ఉంది. పెద్దనోట్లు మార్పిడిని 4నుంచి నాలుగున్నర వేల రూపాయలకు పెంచినట్లు ప్రకటించినప్పటికీ అదికూడా చాలా చోట్ల అమల్లోకి రాలేదు. తెలంగాణ అసెంబ్లీ ఆవరణలోని ఎస్‌బిహెచ్‌లో 4 వేల రూపాయలే నగదు మార్పిడి జరిగింది. అదేమని ప్రశ్నిస్తే సాఫ్ట్‌వేర్ మారలేదని తమ కంప్యూటర్ సిస్టం నాలుగున్నర వేల రూపాయలు అని కొడితే, నాలుగు వేలే చూపిస్తున్నదని సంబంధిత బ్యాంకు సిబ్బంది జవాబిచ్చారు. అక్కడే ఉన్న పోస్ట్ఫాసులో మధ్యాహ్నం 3.30 గంటల నుంచి కేవలం పది నిమిషాలు మాత్రమే నగదు మార్పిడి చేశారు. పెద్ద నోట్లు రద్దయి వారం రోజులైనా ప్రజలు తమ దిన చర్యలను, పనులను పక్కన పెట్టి గంటల తరబడి క్యూలో నిలుచోవాల్సి వస్తున్నది.

చిత్రం.. హైదరాబాద్‌లో ఆంధ్రాబ్యాంకు వద్ద బారులు తీరిన జనం