రాష్ట్రీయం

పట్టుకుంటే లక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, నవంబర్ 20: చిత్తూరు మేయర్ అనూరాధ దంపతుల హత్య కేసులో ప్రధాన నిందితులు చింటూ అలియాస్ చంద్రశేఖర్, రెడ్డి అలియాస్ జయప్రకాష్, వెంకటేష్‌ల ఆచూకి తెలిపిన వారికి లక్ష రూపాయలు బహుమానం ఇస్తామని, సమాచారం ఇచ్చిన వారి పేర్లను రహస్యంగా ఉంచుతామని రాయలసీమ అడిషనల్ డిజి ఠాకూర్ ప్రకటించారు. మేయర్ దంపతుల హత్య కేసు దర్యాప్తు పురోగతిని పరిశీలించడానికి శుక్రవారం ఉదయం ఆయన చిత్తూరుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా హత్య జరిగిన నగర పాలక సంస్థ కార్యాలయాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం మేయర్ కుటుంబ సభ్యులను కలసి వివరాలు సేకరించారు. నగర పాలక సంస్థ ఉద్యోగులు, కార్పొరేటర్లు, ఇతరులను కూడా ఆయన విచారించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మేయర్ దంపతుల హత్యకు సంబంధించిన కేసులో పురోగతిని సాధించామన్నారు. హత్యకు తెగబడ్డదెవరన్న విషయంపై కొంతవరకు ఒక నిర్దారణకు వచ్చామన్నారు. ఈ హత్యలో ఆరుగురికి ప్రమేయం ఉన్నట్టు తమ వద్ద సమాచారం ఉందన్నారు. హత్యకు సంబంధించి ఏవైనా ఆర్థిక లావాదేవీలు సాగాయా, సాగితే ఎలా సాగాయి అనే విషయాలపై కూడా దృష్టి సారించి ఆధారాలు సేకరిస్తున్నామన్నారు. హత్యాకాండకు ఉపయోగించిన పిస్టల్, ఎయిర్ పిస్టల్‌తోపాటు కత్తి, వారు ధరించిన ముసుగులు, వారు చేతికి వేసుకున్న గ్లౌజులను కూడా స్వాధీనం చేసుకున్నామన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఇకపై జనసంద్రం ఉన్న ప్రాంతాలలో, చెక్‌పోస్టుల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ హత్యల వెనుక కుటుంబ కలహాలు ఉన్నాయని ప్రాథమిక నిర్థారణకు వచ్చామన్నారు.