ఆంధ్రప్రదేశ్‌

పట్టాల పండుగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, నవంబర్ 16: ప్రభుత్వ భూములను ఆక్రమించి, ఇళ్లను నిర్మించుకున్న వారికి పట్టాలు ఇచ్చేందుకు సర్వం సన్నద్ధమైంది. విశాఖ వేదికగా నగర పరిధిలోని ఆరు నియోజకవర్గాల్లో తొలిసారిగా ఈ కార్యక్రమాన్ని సిఎం చంద్రబాబు చేతుల మీదుగా గురువారం చేపట్టనున్నారు. దాదాపు 30వేల మందికి రూ.4వేల కోట్ల విలువైన భూములకు సంబంధించి పట్టాలు పంపిణీ చేయనున్నారు. నగర పరిధిలో మాత్రమే జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని భారీస్థాయిలో నిర్వహించాలని యంత్రాంగానికి ప్రభుత్వం నుంచి ఆదేశాలందాయి. మహిళల పేరిట మంజూరు చేసే పట్టాల కార్యక్రమాన్ని వినూత్న రీతిలో నిర్వహించాలని భావిస్తున్నారు. పట్టాలు పొందే ఇంటి నుంచి ఇద్దరిని కార్యక్రమానికి ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రికలు ముద్రించారు. పట్టా తీసుకునే మహిళకు పసుపు, కుంకుమ, పండు, రవికెతో కూడిన ప్రత్యేక గిఫ్ట్ ప్యాకెట్‌ను అందజేయనున్నారు. పట్టాలు తీసుకునే లబ్ధిదారులను వారి స్వస్థలాల నుంచి తీసుకురావడంతో పాటు తిరిగి వారిని క్షేమంగా దించేంత వరకూ అధికారులే బాధ్యత వహిస్తారు. మధ్యాహ్నం భోజనం, సాయంత్రం అల్పాహారం కూడా అధికారులే సమకూరుస్తారు.
ప్రభుత్వం వచ్చే రెండు నెలల వ్యవధిలో మరో మూడు కార్యక్రమాలను చేపట్టనుంది. గాజువాక భూములకు సంబంధించి 301 జిఓ మేరకు భూములను క్రమబద్ధీకరించాలని నిర్ణయించింది. ఇందుకోసం ఇప్పటికే 4 వేల మంది దరఖాస్తు చేసుకున్నారని, మరో 4వేల దరఖాస్తులు క్రమబద్ధీకరణకు వచ్చే అశకాశం ఉందని భావిస్తున్నారు. అర్హుల ఎంపిక పూర్తిచేసి త్వరలోనే మరో భారీ బహిరంగ సభ ద్వారా పట్టాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే 100 చదరపు గజాలకు పైబడిన స్థలాల్లో ఆక్రమణల క్రమబద్ధీకరణకు సంబంధించి ప్రభుత్వ ధర నిర్ణయంలో కేబినెట్ సబ్ కమిటీ తుది నిర్ణయం తీసుకుంటే 118 జిఓకు మార్పులు చేసి, వారికి పట్టాలు పంపిణీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అలాగే విశాఖలో తొలి కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు సింహాచలం భూముల్లో నిర్మాణాలను క్రమబద్ధీకరించే అంశం కూడా చురుకుగా పరిశీలిస్తున్నారు. గురువారం జరిగే కార్యక్రమంతో పాటు వచ్చే రెండు, మూడు నెలల కాలంలో గాజువాక, సింహాచలం, జిఓ 118 కింద భూముల క్రమబద్ధీకరణ పూర్తి చేయడంతో పాటు భారీ, బహిరంగ సభలను ఏర్పాటు చేసి, పట్టాల పంపిణీ చేపట్టే విధంగా యంత్రాంగం సిద్ధంగా ఉండాలని అధికార పార్టీ నుంచి ఆదేశాలు అందాయి. త్వరలోనే జివిఎంసికి ఎన్నికలు జరుగుతాయన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పట్టాల పంపిణీతో ప్రజలను ఆకట్టుకునే వ్యూహంతో టిడిపి ప్రభుత్వం ముందుకు సాగుతోందనడంలో సందేహం లేదు.