ఆంధ్రప్రదేశ్‌

ప్రపంచ భద్రతకు అంతరిక్ష చట్టాల్లో మార్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం నవంబర్ 18: సాంకేతిక పరిజ్ఞానంతో వస్తున్న మార్పులను, అణు, అంతరిక్ష ప్రయోగాల్లో అగ్ర రాజ్యాల వైఖరిని దృష్టిలో పెట్టుకుని ప్రపంచ భద్రతకు ఐద్యరాజ్యసమితి అంతరిక్ష చట్టాల్లో మార్పులు తీసుకురావాల్సి ఉందని బెంగుళూరు నేషనల్ లా యూనివర్సిటీ వైస్-్ఛన్సలర్ ప్రొఫెసర్ ఆర్.వెంకటరావు అన్నారు. ఇక్కడి గీతం విశ్వవిద్యాలయం వేదికగా శుక్రవారం ‘్భ అంతరిక్షాల్లో శాంతి, ప్రపంచ భద్రత, మానవ అభివృద్ధి’ అనే అంశంపై ప్రారంభమైన అంతర్జాతీయ సదస్సులో ఆయన ముఖ్య ప్రసంగం చేశారు. అంతరిక్షంలో అగ్రరాజ్యాలు మిలటరీ స్థావరాలను ఏర్పాటు చేయకుండా అలాగే విధ్వంసకర ఆయుధ ప్రయోగాలకు అంతరిక్షాలు ఉపయోగించకుండా ఐక్యరాజ్యసమితికి చెందిన యునైటెడ్ నేషన్స్ కమిటి ఆన్ ద యూజ్ ఆఫ్ ఔటర్ స్పేస్ ఫర్ పీస్‌ఫుల్ పర్సస్ కృషి చేస్తోందని పేర్కొన్నారు. ఈ కారణంగానే ఇప్పటి వరకు అంతరిక్షంలో కొంతమేర శాంతి నెలకొందన్నారు. అయితే నూతన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన అనంతరం అంతరిక్షాన్ని ఉపయోగించి క్షిపణి దాడులను జరపడం గల్ఫ్ యుద్ధం ద్వారా మొదలైందన్నారు. 2007లో చైనా ప్రయోగించిన ఏ శాట్ పరీక్షలు అంతరిక్షంలో యుద్ధ వాతావరణానికి సంకేతంగా నిలిచాయని ఈ నేపధ్యంలో చిన్నపాటి ఉపగ్రహాలను ప్రయోగించే దేశాలు సంఖ్య క్రమేపి పెరుగుతోందన్నారు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయంగా అంతరిక్ష చట్టాలకు పదును పెట్టడం ద్వారా ఐక్యరాజ్యసమతి శాంతి స్థాపనకు నడుం బిగించాల్సిన సమయం ఏర్పడిందని వివరించారు. అంతరిక్షాన్ని పర్యావరణ పరిరక్షణకు, సామాన్య అపజలు ప్రయోజనాలకు ఉపయోగించాల్సి ఉండగా ప్రైవేటు వ్యక్తులకు అంతరిక్షంలో ప్రవేశం కల్పించడం ఆందోళన కలిగిస్తోందన్నారు. అందరిక్షంలో పర్యాటకం, అంతరిక్షంలో పేరుకుపోతున్న వ్యర్థాల నిర్మూలన, అంతరిక్ష ప్రయోగాలపై నియంత్రణ ప్రస్తుత కాలంలోప్రాధాన్యం సంతరించుకున్నాయన్నారు. సాంకేతికంగా అభివృద్ధి చెందని కాలంలో ఐక్యరాజ్యసమితి రూపొందించిన అంతరిక్ష చట్టాల్లోని ప్రస్తుత టెక్నాలజీ దృష్టా మార్పు చేయాల్సిన అవసరం ఉందన్నారు.