రాష్ట్రీయం

తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింహాచలం, నవంబర్ 19: తెలుగు రాష్ట్రాలు రెండూ సుభిక్షంగా ఉండాలని శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి వారిని కోరుకున్నట్టు ఉభయ రాష్ట్రాల గవర్నర్ ఇఎల్‌ఎస్ నరసింహన్ చెప్పారు. శనివారం ఆయన సింహాచలేశుని దర్శించుకున్న అనంతరం విలేఖరులతో మాట్లాడారు. శ్రీ మహావిష్ణువు స్వయంభూగా వెలసిన ఈ క్షేత్రం ఎంతో మహిమాన్వితమైనదని ఆయన అన్నారు.
లోకమంతా సుఖ శాంతులతో వర్థిల్లాలని ఆయన ఆకాంక్షించారు. ముందుగా గవర్నర్‌కి దేవాలయ కార్యర్వహణాధికారి కె.రామచంద్రమోహన్ అర్చక పెద్దలతో కలిసి సంప్రదాయంగా స్వాగతం పలికారు. గవర్నర్ కప్పస్తంభాన్ని అలింగనం చేసుకొని స్వామివారిని ప్రార్థించుకున్నారు. అంతరాలయంలో నరసింహన్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులందరి పేరున అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. గోదాదేవి సన్నిధిలో మంగళ హరతులిచ్చారు. ఆస్థాన మండపంలో నాదస్వర వాయిద్యాలు, వేదపండితుల మంత్రోచ్చారణల నడుమ అర్చకులు గవర్నర్‌ని ఆశీర్వదించారు. ఈవో గవర్నర్‌కి స్వామివారి శేషవస్త్రాలు, చిత్రపటం, ప్రసాదాలు అందజేసారు.
క్షేత్ర మహాత్మ్యాం అడిగిన గవర్నర్
గవర్నర్ నరసింహన్ అంతరాలయంలో పూజల అనంతరం క్షేత్ర మహాత్మ్యాం చెప్పమని ఆలయ అర్చకులను కోరగా అర్చకుడు కరి సీతారామాచార్యులు స్వామివారి అవతార రహస్యం, క్షేత్ర విశిష్టతలను గవర్నర్‌కి వివరించారు. గవర్నర్ వెంట విశాఖ నగర పోలీసు కమిషనర్ యోగానంద్, ఎసిపి భీమారావు ఉన్నారు.

చిత్రం.. సింహాచలేశుని దర్శించుకున్న గవర్నర్ నరసింహన్