తెలంగాణ

పేదల ఇళ్లకు ఎందుకు జాప్యం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 28: తెలంగాణ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయాన్ని ఏడాదిలోగా యుద్ధప్రాతిపదికన నిర్మించిన ప్రభుత్వం, పేదలకోసం ఉద్దేశించిన డబుల్ బెడ్‌రూం ఇళ్లపథకాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తోందని తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ (టి-జాక్) చైర్మన్ ప్రొఫెసర్ కోందడరాం ప్రశ్నించారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, వాస్తవంగా ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం కోసం ఇప్పటికే ఒక భవనం ఉందన్నారు. ఒకవేళ ఈ భవనం సరిపోకపోతే దీని విస్తీర్ణాన్ని మరింత పెంచుకోవచ్చని గుర్తు చేశారు. వాస్తుపేరుతో సిఎం క్యాంపు కార్యాలయానికి కొత్తగా మరొక భవనం నిర్మించారని గుర్తు చేశారు. ఒక భవనం ఉండగానే మరొక భవనం నిర్మించడం అంటే ప్రజల డబ్బును దుర్వినియోగం చేయడమేనని అన్నారు. ముఖ్యమంత్రి కోసం ఆధునిక హంగులతో కోట్ల రూపాయలతో ఒక భవనాన్ని ఏడాదిలోగా నిర్మించే సత్తా ఉన్న ప్రభుత్వానికి పేదలకోసం డబుల్ బెడ్‌రూం ఇళ్లను నిర్మించి ఇచ్చేందుకు ఎందుకు జాప్యం జరుగుతోందో చెప్పాలని ప్రశ్నించారు.
ఈ నెల 30న హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో భూనిర్వాసితుల సదస్సు నిర్వహిస్తున్నామని కోదండరాం వివరించారు. ఆరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు సదస్సు జరుగుతుందన్నారు. కాళేశ్వరం, ఓపెన్‌కాస్ట్, పాలమూరు-రంగారెడ్డి, నిమ్జ్ తదితర ప్రాజెక్టుల కోసం ప్రైవేట్ భూములను స్వాధీనం చేసుకోవడం, రైతుల నుండి బలవంతంగా భూములను స్వాధీనం చేసుకోవడం మంచి నిర్ణయం కాదన్నారు. భూనిర్వాసితుల గురించి మాట్లాడితే అభివృద్ధి నిరోధకులు అంటూ ముద్రవేస్తున్నారని ఆరోపించారు. రైతుల సమస్యలు వినకుండా దబాయింపుతో భూములను లాక్కోవడం మంచిది కాదన్నారు. రైతుల సమస్యలను తెలుసుకోవడం, ప్రభుత్వ విధానాలపై అవగాహన కల్పించడం తమ ముందున్న లక్ష్యమన్నారు.