రాష్ట్రీయం

ఇది నా రెండో మజిలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 30: వెలగపూడిలోని సచివాలయానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బుధవారం నుంచి అధికారికంగా పరిపాలన ప్రారంభించారు. బుధవారం ఉదయం సరిగ్గా 11.45గంటలకు సచివాలయానికి చేరుకున్న ఆయనకు ఉద్యోగులు సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన ఎంతో ఉద్వేగంతో ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించారు. వెలగపూడి సచివాలయం నుంచి పరిపాలన సాగించటం తనకు రెండో మజిలీ అని ముఖ్యమంత్రి అభివర్ణించారు. నవ్యాంధ్ర చరిత్రలో బుధవారం నుంచి ఒక కొత్త శకం ప్రారంభమైందని ఆయన వ్యాఖ్యానించారు. ‘మీ త్యాగాలు ఊరికే పోవు. మీ ఇబ్బందులు తొలగించేందుకు ఎల్లవేళలా తోడుగా ఉంటా’ అంటూ ఉద్యోగులకు భరోసా కల్పించారు. ప్రపంచంలో ఏ రాజధానికీ లేనన్ని ఆకర్షణలు అమరావతికి ఉన్నాయని, కృష్ణానది, వాస్తు, పర్వత శ్రేణులు, పచ్చదనం అమరావతి సొంతమని అన్నారు. ఉద్యోగులతో మాట్లాడాక, ఆయన తన చాంబర్‌కు చేరుకున్నారు. వెలగపూడి నుంచి కార్యకలాపాలు నిర్వహించేందుకు నిర్ణయించుకున్న నేపథ్యంలో మొదటి రోజు నుంచే తనదైన రీతిలో విధులు నిర్వహించారు. మధ్యాహ్నం మూడు గంటల వరకు కార్యాలయంలోనే ఉన్న చంద్రబాబు అమరావతిలో రోడ్ల నిర్మాణంపై పురపాలక శాఖ అధికారులతో తొలి సమీక్ష సమావేశం నిర్వహించారు. సచివాలయంలో ఆయన కార్యాలయం ఉన్న బ్లాక్ -1 వద్ద ఆయనకు ఉద్యోగులు సాదర స్వాగతం పలికారు. ఈసందర్భంగా ఆయన ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడుతూ తెలుగు వారు ఏన్నో కష్టాలు పడ్డారని, రాజధాని కోసం ఇన్ని ఇబ్బందులు పడిన చరిత్ర ఇంకెక్కడా లేదని తెలిపారు. తొమ్మిది సంవత్సరాలు శ్రమించి హైదరాబాద్‌ను ప్రపంచ పటంలో నిలిపానని గుర్తుచేశారు. ఇప్పుడు నవ్యాంధ్ర కోసం అంతకుమించి కష్టపడుతున్నానన్నారు. 16 వేల కోట్ల రూపాయల లోటు బడ్జెట్‌తో ప్రయాణం ప్రారంభించామన్నారు. విజయవాడలో క్యాంప్ కార్యాలయం ఏర్పాటు చేసుకునే వరకూ బస్‌లోనే ఉండి పాలన సాగించానని, ఇప్పుడు వెలగపూడి సచివాలయం నుంచి చేస్తానన్నారు. ఇది తన రెండో ప్రయాణం ప్రారంభించామన్నారు. సిఎం కార్యదర్శులు సతీష్ చంద్ర, రాజవౌళి, నగర పోలీస్ కమిషనర్ గౌతంసవాంగ్ తదితరులు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. సచివాలయంలో గురువారం మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారు.
chitram...
వెలగపూడిలో సచివాలయ ఉద్యోగులతో మాట్లాడుతున్న చంద్రబాబు