రాష్ట్రీయం

త్వరలో స్మార్ట్ వాటర్ గ్రిడ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చంద్రగిరి, నవంబర్ 27: ఆంధ్రలో నదుల అనుసంధానం ద్వారా స్మార్ట్ వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నట్టు సిఎం చంద్రబాబు పేర్కొన్నారు. తన మనుమడు దేవాన్ష్‌కు స్వగ్రామంలో పుట్టు వెంట్రుకలు తీయించే కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం శుక్రవారం ఆయన కల్యాణి డ్యాంను పరిశీలించారు. ఈ సందర్భంగా డ్యాం గేటు ఎత్తి నీటిని కిందికి విడుదల చేశారు. అనంతరం గంగ పూజ చేసి హారతులిచ్చారు. అక్కడే మీడియాతో మాట్లాడుతూ 20 ఏళ్ల తరువాత కల్యాణి డ్యాం నిండిందని, ఈ నీటితో మూడేళ్ళపాటు తిరుపతికి నీటి సమస్య ఉండదన్నారు. చిత్తూరు జిల్లాలో 60 మినహా మిగిలిన అన్ని చెరువులు నిండాయన్నారు. కొద్ది రోజులుగా కురిసిన వర్షాలతో 33 శాతం ఉండే భూగర్భ జలాలు 14 మీటర్లు పైకి వచ్చిందని తెలిపారు. వరుస కరవులతో రాయలసీమ నష్టపోయిందన్నారు. రాష్ట్రంలో మరో విడత నీరు-చెట్టు కార్యక్రమాన్ని చేపడతామన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను కరవురహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని సిఎం పునరుద్ఘాటించారు. ఉన్న నీటిని పొదుపుగా వాడుకోవాలని హితవు పలికారు. రాష్ట్రంలో రూ.100 కోట్ల ఖర్చుతో పంట సంజీవిని పేరిట అభివృద్ధి చేసేందుకు స్పెషల్ డ్రైవ్ చేపడతామని ప్రకటించారు. చిత్తూరు జిల్లాకు జూన్ నెలాఖరులోగా హంద్రినీవా తీసుకొస్తామని సిఎం చెప్పారు. వర్షపునీటిని కాల్వల ద్వారా తీసుకొచ్చి అన్ని చెరువులను నింపుతామన్నారు. కపిలతీర్థం నీటిని కాల్వ ద్వారా వినియోగించుకునేలా చేస్తామని, కాళంగి రిజర్వాయర్ గేట్లు మరమ్మతులను రెండురోజుల్లో పూర్తిచేస్తామని, కుప్పం ప్రాజెక్టును పూర్తి చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.

చిత్రం.. కల్యాణి డ్యాంవద్ద గంగకు హారతి ఇస్తున్న సిఎం చంద్రబాబు