రాష్ట్రీయం

తెగిపోయిన ముక్కు స్థానంలో కొత్తది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 2: నగరంలోని జూబిలీహిల్స్ అపోలో హాస్పిటల్‌కు చెందిన వైద్యులు ఒక అరుదైన కేసులో టాంజానియాకుచెందిన ఓ వ్యక్తికి ముక్కును అమర్చుతూ చేసిన శస్తచ్రికిత్స విజయవంతమైంది. ఈ అరుదైన శస్తచ్రికిత్స వివరాలను సీనియర్ కన్సల్టెంట్, ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ సుధాకర్ ప్రసాద్ వివరించారు. తీవ్రదాడిలో ముక్కును కోల్పోయిన టాంజానియాకు చెందిన వ్యక్తి శరీరంలోని వివిధ భాగాల నుంచి సేకరించిన చర్మం, మెత్తటి ఎముక భాగాలు, రక్తనాళాలను ఉపయోగించి కొత్తగా నిర్మించిన ముక్కును ముఖంపై అమర్చారు. ఆపరేషన్ చేయించుకున్న వ్యక్తి పేరు సిలాహ్ క్వాహూ. 2014 సెప్టెంబర్‌లో జరిగిన కత్తిపోటు సంఘటనలో ముఖంలో అనేక గాయాలకు గురై ముక్కును కూడా పూర్తిగా కోల్పోయాడు. ప్లాస్టిక్, మైక్రో సర్జరీ ద్వారా ఈ శస్తచ్రికిత్సచేశారు. ప్రీ ఫ్యాబ్రికేటెడ్ ఫ్లాప్ అనే ఒక సంక్లిష్ట పద్ధతి ద్వారా రోగికి శాశ్వత ఉపశమనాన్ని కల్పించామన్నారు. ముఖంపైన ప్రధాన భాగం కోల్పోయిన తర్వాత సంప్రదాయ మార్గాల ద్వారా పునర్నిర్మాణం చేయడం అసాధ్యమన్నారు. ఆధునిక టెక్నాలజీ ద్వారానే ఈ ఆపరేషన్ సాధ్యమైందన్నారు.