రాష్ట్రీయం

పోటీతత్వంతో ప్రతిభకు రాణింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 3 : న్యాయవిద్యతోపాటు అన్ని విద్యాసంస్థల్లో పోటీతత్త్వం వల్ల విద్యార్థులు, అభ్యర్థులలో ప్రతిభ పెరుగుతుందని ఆంధ్రప్రదేశ్ జుడిషియల్ అకాడమీ అధ్యక్షుడు జస్టిస్ చంద్రయ్య అన్నారు. సికింద్రాబాద్‌లోని ఆంధ్రప్రదేశ్ జుడిషియల్ అకాడమీలో ఆదివారం ఏర్పాటు చేసిన జస్టిస్ ఎంఎన్ రావు గోల్డ్‌మెడల్స్, జస్టిస్ టిహెచ్‌బి చలపతి మెమోరియల్ గోల్డ్ అండ్ సిల్వర్ మెడల్స్ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది.
ఈ సందర్భంగా జస్టిస్ చంద్రయ్య మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి అనేక కేసులు కింది స్థాయిలో ఉండే మెజిస్ట్రేట్ కోర్టులకు ఎక్కువగా వస్తాయని, అట్టడుగు స్థాయి నుండి ఉన్నత స్థాయి వరకు వేర్వేరు కోర్టుల్లో న్యాయమూర్తులు ఇచ్చే తీర్పులపై ప్రజలకు ఎంతో నమ్మకం ఉంటుందని, ఈ నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం జుడిషియరీపై ఉంటుందని అన్నారు. జూనియర్ సివిల్ జడ్జిలు, జిల్లా జడ్జిల నియామకాలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రతిభ ఆధారంగా కొనసాగుతున్నాయని, దాంతో అద్భుత ప్రతిభ కనబరిచే అభ్యర్థులు న్యాయమూర్తులుగా ఎంపికవుతున్నారు. వీరికి మంచి శిక్షణ ఇస్తున్నామని, భారత రాజ్యాంగం, ఇండియన్ పీనల్ కోడ్ (ఐపిసి), క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సిఆర్‌పిసి) లతో పాటు ప్రభుత్వం రూపొందించే వివిధ చట్టాలపై పూర్తి అవగాహన లభించేలా శిక్షణ ఇస్తున్నామన్నారు. సమాజాన్ని దృష్టిలో ఉంచుకుని వీలైనంత త్వరగా కేసులపై విచారణ పూర్తిచేసి, తీర్పులను వెలువరించాలని జుడిషియల్ అకాడమీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు సి. ప్రవీణ్‌కుమార్, ఎంఎస్ రామచంద్రరావులు కోరారు.
జస్టిస్ ఎంఎన్ రావు గోల్డ్ మెడల్స్ అందుకున్న వారిలో కిరణ్ పాలకుర్తి, పి. వెంకట జ్యోతిర్మయి, బి. శ్రీదేవి, ఎ. హరిహరనాథ శర్మ, డి. కిరణ్‌కుమార్, కె. మాధవి ఉన్నారు. అలాగే జస్టిస్ టిహెచ్‌బి చలపతి మెమోరియల్ గోల్డ్ అండ్ సిల్వర్ మెడల్స్ అందుకున్న వారిలో జివి మహేశ్ నాథ్, కె. మురళిమోహన్ ఉన్నారు.