రాష్ట్రీయం

చేనేతకు చేయూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భూదాన్ పోచంపల్లి, డిసెంబర్ 8: ఖండాంతర ఖ్యాతి చెందిన పోచంపల్లి చేనేత రంగాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని ఐటి శాఖామంత్రి కెటిఆర్ హామీ ఇచ్చారు. గురువారం భూదాన్ పొచంపల్లి మండలం కనుముకుల గ్రామం చేనేత పార్కును ఆయన సందర్శించారు. చేనేత పార్కులోని మగ్గాలను, వస్త్రాలను ఆయన పరిశీలించారు. వస్త్రాల తయారీ విధానం, రంగుల అద్దకాల ప్రక్రియను అడిగి తెలుసుకున్నారు.
హ్యాండ్‌లూమ్ పార్కు నిర్వహణ, ప్రభుత్వ సహకారం, చేనేత కార్మికులకు కల్పిస్తున్న ఉపాధి అంశాలపై కేటి ఆర్‌కు హ్యాండ్‌లూమ్ పార్కు చైర్మన్ దేవేందర్, సిఇఒ దామోదర్ వివరించారు. అనంతరం ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ చేనేత రంగానికి బడ్జెట్‌లో నిధులు పెంచడానికి ముఖ్యమంత్రితో మాట్లాడతానని అన్నారు. టెక్స్‌టైల్ మాదిరిగా హ్యాండ్‌లూమ్ పార్కును ఆధునీకరించేందుకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఆయా పార్కుల్లో మిషన్ భగీరథ ద్వారా మంచినీటి వసతి, సబ్‌స్టేషన్‌ను ఏర్పాటు చేస్తామన్నారు.
దేశ విదేశాల నుండి వచ్చే ప్రముఖులు, పర్యాటకులకు, అతిధులకు సంస్కృతి, సంప్రప్రదాయంగా చేనేత వస్త్రాలనే బహుకరిస్తామని పేర్కొన్నారు. ఈ సంవత్సరంలోపు హ్యాండ్‌లూమ్, టెక్స్‌టైల్ రంగాన్ని అభివృద్ధి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ప్రభుత్వ రంగ సంస్ధలు, అధికారులు, నాయకులు చేనేత వస్త్రాలు ధరించి కార్మికులను ఆదుకోవాలని కోరారు.

చిత్రం..కనుముకులలో చేనేత వస్త్రాలను పరిశీలిస్తున్న మంత్రి కెటిఆర్