రాష్ట్రీయం

50మంది డిఎస్పీల బదిలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 12: రాష్టవ్య్రాప్తంగా 50మంది డిఎస్పీలు ఒక్కసారిగా బదిలీ అయ్యారు. డిఎస్పీలను బదిలీ చేస్తూ సోమవారం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈమేరకు డిజిపి అనురాగ్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని డిజిపి ప్రకటించారు. కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో సిబ్బంది కొరతను తీర్చేందుకు ప్రభుత్వం పోలీసు అధికారులను సర్దుబాటు చేసింది. తొలుత జిల్లా ఎస్పీలను కేటాయించగా, ప్రస్తుతం డిఎస్పీలను సబ్ డివిజనల్ కార్యాలయాలకు సర్దుబాటు చేసింది. ఈ మేరకు ఏసిపి, ఎస్‌డిపిఓ, వెయిటింగ్‌లో ఉన్న అధికారులను బదిలీ చేస్తూ, మరికొందరిని జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్‌కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.