రాష్ట్రీయం

ఆయిల్ ట్యాంకర్ ఢీకొని నలుగురు దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆమనగల్లు, డిసెంబర్ 12: ఓ శుభకార్యానికి వెళ్లి తిరిగివస్తున్న ఓ కుటుంబాన్ని ఓ లారీ చిదిమేసింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురి ప్రాణాలు బలితీసుకుంది. హైదరాబాద్ - శ్రీశైలం 765 నంబర్ జాతీయ రహదారిపై బైకుపై వెడుతుండగా ఆయిల్ ట్యాంకర్ ఢీకొనడంతో దంపతులతో పాటు వారి ఇద్దరు పిల్లలు ప్రాణాలు కోల్పోయారు.
రంగారెడ్డి జిల్లా కడ్తాల మండలం టోల్‌గేట్ సమీపంలో సోమవారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఎదుల కృష్ణయ్య (45), ఆయన భార్య హైమవతి (38), వారి కూతురు దివ్య (13), కుమారుడు విష్ణువర్ధన్ (12) మృతి చెందారు. హైదరాబాద్ నుండి కల్వకుర్తి వైపు వస్తున్న ఎపి 29యు 9776 నంబర్ గల ఆయిల్ ట్యాంకర్ కల్వకుర్తి నుండి ఓ శుభకార్యం ముగించుకుని తిరిగి హైదరాబాద్‌కు ఎపి10డిఇ 5449 నంబర్ గల బైక్‌పై వెళ్తున్నారు. ఇంతలోపే కడ్తాల మండల సమీపంలోని టోల్‌గేట్ దగ్గర అతివేగంగా ఎదురుగా వచ్చిన ఆయిల్ ట్యాంకర్ ఢి కొట్టింది. దింతో బైకుపై ప్రయాణిస్తున్న భార్యభర్తలతో పాటు వారి ఇద్దరు పిల్లలు అక్కడికక్కడే మృతి చెందారు. వారిపై నుండి ట్యాంకర్ వెళ్లడంతో మృతదేహాలు నుజ్జునుజ్జు అయ్యాయి. మృతులు నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలం అంబటిపల్లి గ్రామానికి చెందిన వారు. బతుకుదెరువు నిమిత్తం హైదరాబాద్‌లోని పాత బోయిన్‌పల్లిలో అద్దె ఇంట్లో నివాసం ఉంటూ టైలరింగ్ చేస్తూ కృష్ణయ్య జీవనం కొనసాగిస్తున్న నేపథ్యంలో మృత్యువు వెంటాడి ఇలా కబళించింది. ఘటన స్థలాన్ని ఆమనగల్లు సిఐ రవీంద్రప్రసాద్, ఎస్సైలు రామలింగారెడ్డి, సురేష్‌యాదవ్, శ్రీకాంత్‌లు చేరుకుని ప్రమాదానికి సంబందించిన వివరాలను సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు సిఐ రవీంద్రప్రసాద్ తెలిపారు.