రాష్ట్రీయం

20 వేల కోట్లు వస్తున్నాయి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 13: వచ్చే 17 రోజుల్లో నోట్ల రద్దు సమస్య పూర్తిగా పరిష్కారమవుతుందని సిఎం చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నెల 15-20 తేదీల మధ్య రాష్ట్రానికి మరో 20వేల కోట్ల రూపాయలు రానున్నాయని, దీంతో చాలావరకూ సమస్య తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. విజయవాడ ఉండవల్లిలోని తన నివాసం నుంచి జిల్లా కలెక్టర్లు, ఆర్థిక శాఖ అధికారులు, బ్యాంకర్లతో మంగళవారం ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా జనవరి నాటికి తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు, నగదు రహిత లావాదేవీల పురోగతిపై సమీక్షించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో నగదును అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. ఇందుకు ఆ నాలుగు జిల్లాల బ్యాంకర్లు సహకరించాలని కోరారు. మూడు రోజుల సెలవుల తరువాత రద్దీ ఎక్కువగా ఉంటుందని, దీన్ని దృష్టిలో ఉంచుకుని బ్యాంక్‌లు, ఎటిఎంల వద్ద ప్రజలకు సహకరించాలని ఆదేశించారు. మంచి జరుగుతుందనే భావనతో ప్రజలు సహకరిస్తున్నారని, వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత బ్యాంకర్లు, అధికార యంత్రాంగంపై ఉందని స్పష్టం చేశారు.
చలామణిలో ఉన్న నగదుకు, నోట్ల ముద్రణకు మధ్య ఉన్న కాల వ్యవధిని డిజిటల్ లావాదేవీలతో భర్తీచేయాలన్నారు. జనవరి నుంచి రేషన్ దుకాణాల్లో నగదు రహిత లావాదేవీలు జరగాలన్నారు. డిసెంబర్ 20 నుంచి క్రిస్మస్ కానుకలు, జనవరి 1 నుంచి సంక్రాంతి కానుకల పంపిణీ సక్రమంగా చేపట్టాలన్నారు. బ్యాంకింగ్ కరెస్పాండెట్లుగా పనిచేసే అవకాశాన్ని రేషన్ దుకాణాల డీలర్లు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
రేషన్ డిపోల్లో నగదు రహిత లావాదేవీల నిర్వహణకు వీలుగా ఐదు జిల్లాల్లో ఏర్పాట్లు చేయకపోవడం పట్ల సిండికేట్ బ్యాంక్ అధికారుల తీరుపై ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉపాధి కూలీలకు చెల్లించాల్సిన 117 కోట్ల రూపాయల్లో ఇప్పటికే 70 కోట్లు పోస్ట్ఫాసులకు విడుదల చేశామన్నారు. మొబైల్ లావాదేవీలకు ఎం-పిన్ ఇవ్వడంలో అన్ని బ్యాంక్‌లు ఒకే రకంగా ఉండేలా చూడాలన్నారు. డ్వాక్రా మహిళలకు, పింఛనుదారులకు నగదు చెల్లిస్తే ఆ మొత్తం త్వరగా చలామణిలోకి వస్తుందన్నారు.