తెలంగాణ

జాతీయవాద రచనలతో సమాజం ప్రభావితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, జనవరి 3: ప్రముఖ రచయిత, కవి బండారు సదాశివరావు తన జాతీయవాద రచనలతో సమాజాన్ని ప్రభావితం చేశారని చారిత్రక నవలా చక్రవర్తి, ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ పూర్వ అధ్యక్షుడు ఆచార్య ముదిగొండ శివప్రసాద్ అన్నారు. హన్మకొండ హంటర్‌రోడ్‌లోని శ్రీవ్యాసప్రతిష్టాన్ సేవా సంఘం శ్రీవ్యాస ఆవాసంలో ఆదివారం ఉదయం ‘స్వర్గీయ బండారు సదాశివరావు సాహిత్య సమాలోచనం’ పేరిట నిర్వహించిన సాహిత్య కార్యకమానికి ఆయన ప్రధానవక్తగా హాజరై ప్రసంగించారు. శ్రీ వ్యాస ప్రతిష్టాన్ సేవా సంఘం అధ్యక్షుడు అలువాల బిక్షపతి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా పోతన విజ్ఞానపీఠం కార్యదర్శి నమిలికొండ బాలకిషన్‌రావు, ఆత్మీయ అతిథిగా జాగృతి వారపత్రిక పూర్వ సంపాదకులు డాక్టర్ వడ్డి విజయసారధి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధానవక్త ఆచార్య ముదిగొండ శివప్రసాద్ మాట్లాడుతూ తన రచనల ద్వారా బండారు సదాశివరావు భారతదేశ ప్రాచీన చారిత్రక పరంపర, వైభవస్థితిని చక్కగా వివరించారన్నారు. ఆయన కేవలం రచనలకే పరిమితం కాకుండా సామాజికరంగంలో పలు కార్యక్రమాలకు రూపకల్పన చేశాడన్నారు. వరంగల్‌లో ఆయన ప్రేరణతో ఎందరో రచయితలుగా, కవులుగా తమకు తమల్ని తీర్చిదిద్దుకున్నారన్నారు. తనకు చారిత్రక నవలలు రాయడానికి ప్రేరణ కల్పించిన మహానుభావుడు బండారు సదాశివరావు అన్నారు. ఆయన రచించిన పుస్తకాలను భారతీయ భాషల్లోకి అనువదించాల్సిన సమయం వచ్చిందన్నారు. తన జీవితమంతా సమాజానికి సమర్పితం చేసిన కర్మశీలి బండారు అని వారన్నారు. దేశంలో అత్యయిక పరిస్థితి (ఎమర్జెన్సీ) విధించినపుడు ఆయనను వరంగల్ సెంట్రల్ జైలులో వేస్తే అక్కడికి వచ్చి కమ్యూనిస్టు, సోషలిస్టుకు జాతీయవాద పాఠాలు నేర్పిన ధీశాలి బండారు సదాశివరావు అన్నారు. ఓరుగల్లు లాంటి చారిత్రక గడ్డపై ఆయన జన్మించడం అదృష్టమన్నారు. ముఖ్య అతిధి నమిలికొండ బాలకిషన్‌రావు మాట్లాడుతూ తాము యువకులుగా ఉన్నప్పుడు బండారు సదాశివరావు తమను రచనలు చేయమని ప్రోత్సహించేవారన్నారు. వరంగల్‌లో పోతన విజ్ఞానపీఠం ఏర్పాటులో ఆయన పాత్ర క్రియాశీలకమన్నారు. తన సంపాదకత్వంలో వెలువడే సాధన పత్రికను ఎంతగానో ప్రోత్సహించేవారన్నారు. అయతే, తాను కొన్ని విషయాల్లో ఆయనతో విభేదిస్తూనే ఏకీభవించేవాడినన్నారు. ఆత్మీయ అతిథిగా వచ్చిన డాక్టర్ వడ్డి విజయసారథి మాట్లాడుతూ సదాశివరావు పురణాల్లోంచి, ఉపనిషత్తుల్లోంచి తీసుకుని రచించిన కథల సంపుటి ‘మన వారసత్వం’ విద్యార్థులలో దేశభక్తిని పెంపొందిస్తుందన్నారు. జాగృతి వారపత్రిక సంపాదకుడిగా, జాతీయ సాహిత్య పరిషత్ అఖిల భారత అధ్యక్షుడిగా ఉంటూ బండారు సాహితీరంగానికి అమూల్యమైన సేవలందించారన్నారు.
ఆయన రాసిన కథలు, నవలలు, పద్యాలు, కవితలు, వ్యాసాలు నేటితరానికి ప్రేరణనిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీవ్యాస ఆవాసం అధ్యక్షుడు రామిని రామప్ప, శ్రీవ్యాసప్రతిష్టాన్ సేవా సంఘం కార్యదర్శి పొన్నాల వెంకటరామనర్సయ్య, ఉపాధ్యక్షురాలు కాసర్ల వసుందర, కార్యవర్గ సభ్యులు కూతురు సాంబశివరెడ్డి, కొట్టెగోపాల్, ఆచార్య చిలకమారి సంజీవ, ఆచార్య బాలస్వామి, పొల్సాని లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.