తెలంగాణ

తెలంగాణ ప్రజా ఉద్యమాలకు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్,జనవరి 4: తెలంగాణ ప్రజా ఉద్యమాల్లో చైతన్యస్రవంతిని రగిలించి ఊపిరి పోసిన సాహిత్యాన్ని, ప్రపంచీకరణలో అస్థిత్వాన్ని కోల్పోతున్న తెలుగుభాషను కాపాడుకోవాల్సిన బాధ్యత భావితరాలపై ఉందని తెలంగాణ సాహితీ ప్రముఖులు అభిప్రాయపడ్డారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటి ప్రాంగణంలో రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం, తెలుగుశాఖ అధ్వర్యంలో తెలంగాణ ఉద్యమ సాహిత్యం సమాలోచన అంశంపై జాతీయ సదస్సు నిర్వహించారు. తొలిరోజు ఈ సదస్సుకు ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, నవలా రచయిత డాక్టర్ అంపశయ్య నవీన్, ప్రముఖ సాహితివేత్త ఆచార్య జయధీర్ తిరుమలరావు, ప్రముఖ సాహితీవేత్త ఆచార్య ఎస్.శరత్ జోత్స్నారాణి, ఆర్‌జియుకెటి వైస్‌చాన్సలర్ ఎస్.సత్యనారాయణ తదితరులు ప్రసంగించారు. ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ ప్రపంచీకరణ, స్థానిక జీవన వైవిధ్యాలతో తెలుగుభాష క్రమేపీ అంతరించిపోతోందని, రజాకార్ల ఉద్యమం నుండి తెలంగాణ ప్రజా ఉద్యమాల వరకు తెలంగాణ సాహిత్యం, తెలుగుభాష ఉద్దీపన గావించి పురుడు పోసిందని అన్నారు. నైజాం పాలనలో పీడన, దోపిడిపై సాహిత్యం పోరుబాటసలిపిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ప్రజా ఉద్యమాలతో సాహిత్యం మమేకం కావడం వల్లే తెలంగాణ సుసంపన్నమైందని, విద్యార్థులు గత చరిత్రను స్ఫూర్తిగా తీసుకుని సాహిత్య సౌరభాలు వెల్లివిరిసేలా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కేంద్ర సాహిత్య ఆవార్డు గ్రహిత అంపశయ్య నవీన్ మాట్లాడుతూ నిజాం పాలనలో దురాగతాలు, శ్రమదోపిడీ కొనసాగిందని, కమ్యూనిస్టులు ఆంధ్ర నాయకులతో కలిసి సాగించిన సాయుధ పోరాటంలో 4వేల మంది చనిపోయిన ఘట్టాలను విపులీకరించారు. ఆచార్య జయధీర్ తిరుమలరావు మాట్లాడుతూ కంటికి కనిపించే సాహిత్యం కన్నా శబ్దసాహిత్యం ప్రజా జీవితంలో కీలకఘట్టంగా మలుపుతిప్పిందని పేర్కొన్నారు. రాజరికాన్ని, రాజకీయ వలసలను, పరాయి పాలకుల విధానాలను సంఘటితంగా ఎండగట్టిన సాహితీవేత్తలు, చరిత్రకారులను విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకొని తెలుగు భాషను మరింత ఇనుమడింపజేయాలని సూచించారు. తెలంగాణ ప్రజా ఉద్యమంలో ఆదివాసీలు సైతం నిజాం పాలకులను ఎదురించిన వైనాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో రాజీవ్‌గాంధీ సాంకేతిక వైజ్ఞానిక యూనివర్సిటీ వైస్‌చాన్సలర్ ఎస్.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.