రాష్ట్రీయం

బిల్లుల వ్యవహారంపై ప్రభుత్వం సీరియస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 12: డైరక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కార్యాలయంలో కేవలం ఐదు రోజుల వ్యవధిలో రెండు దఫాలుగా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల మెడికల్ బిల్లులు అగ్నికి ఆహుతి అయిన ఘటనపై ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ పూనం మాలకొండయ్య సీరియస్ అయ్యారు. ఈ ఘటనలో డైరక్టర్ డాక్టర్ సుబ్బారావు నిర్లక్ష్యాన్ని గుర్తించిన ఆమె ఏకంగా బిల్లుల పరిశీలన, మంజూరు బాధ్యతల నుంచి డిఎంఇ కార్యాలయాన్ని పూర్తిగా తప్పించడం సంచలనం సృష్టిస్తున్నది. తక్షణమే ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్ట్ సిఇవోను వాటి బాధ్యతలు చేపట్టే విధంగా హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ విభాగం తరఫున పూనం మాలకొండయ్య బుధవారం రాత్రి జీవోఎంఎస్ నెం.6ను జారీ చేశారు. తమ కార్యాలయంలో ఉన్న మెడికల్ బిల్లులన్నింటినీ తక్షణమే సిఇవోకు అప్పగించేలా కూడా చర్యలు చేపట్టారు. అంటే మొదటినుంచి కూడా ఈ బిల్లుల పరిశీలన, మంజూరులో నెలల తరబడి జాప్యం జరుగుతున్నదంటూ ఉద్యోగ సంఘాల నేతలు ఫిర్యాదు చేస్తున్నారు. తాజాగా డైరక్టర్ నిర్లక్ష్యం కారణంగానే మూడు వేలకు పైగా బిల్లులు అగ్నికి ఆహుతి కావటంపై ఉద్యోగ సంఘాల నేతలు మరింత ఆగ్రహోదగ్రులయ్యారు. ఈ ఘటనపై ఆంధ్రభూమి దినపత్రికలో ప్రత్యేక కథనాలు ప్రచురితమైన విషయం తెలిసిందే. తాజాగా విడుదల చేసిన జిఓలో సాధ్యమైనంత త్వరగా బిల్లులను పరిశీలించి మంజూరు చేయాలంటూ సిఇవోను ఆదేశించారు. అవసరమైతే ఎపిఐఎంఎ రూల్స్ 1972 ప్రకారం ఎంప్లాయ్ హెల్త్ స్కీం నుంచి కొంత ఆర్థిక సహాయం తీసుకుని బిల్లుల పరిశీలనకు అదనంగా ప్యానెల్ స్పెషలిస్టులను నియమించుకునే అధికారం కూడా ఈ జీవో ద్వారా అప్పగించబడింది. ఇక మరోవైపు బిల్లులు తగులబడిన ఘటనపై పోలీస్ శాఖ తన విచారణను కొనసాగిస్తున్నది.