రాష్ట్రీయం

దావోస్‌కు చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 15: పెట్టుబడులు, ఉపాధి అవకాశాలే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం రాత్రి దావోస్‌కు బయలుదేరి వెళ్లారు. అమరావతి నిర్మాణం, మెట్రో రైలు ప్రాజెక్టులు, ప్రపంచస్థాయి విద్యాసంస్థల స్థాపన, పెట్టుబడుల ఆకర్షణ, పరిశ్రమల ఏర్పాటుతో యువతకు లక్షల ఉద్యోగావకాశాల సాధనకు దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక 47వ వార్షిక సదస్సు-2017ను వేదికగా సిఎం చంద్రబాబు నాయుడు ఎంచుకున్నారు. ఈ నెల 16న జ్యూరిచ్‌లో, 17 నుంచి 20 వరకు దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ఆయన పాల్గొంటారు. కొత్త ఢిల్లీ నుంచి బయలుదేరి స్విస్ కాలమానం ప్రకారం ఉదయం 6.25 గంటలకు సిఎం జ్యూరిచ్ చేరుకుంటారు. అక్కడ భారీ ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణలో అపార అనుభవమున్న ‘స్టాడ్లర్ మేనేజిమెంట్’ ఏజీతో ద్వైపాక్షిక సమావేశం ఉంటుంది. యూరోపియన్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ కౌన్సిల్ ప్రతినిధులతో ద్వైపాక్షిక సమావేశంలో కూడా పాల్గొంటారు. బికెడబ్ల్యు ఎనర్జీ ఏజీ పాల్‌క్లాజ్, ఫ్రానె్సస్కో ఘెరిలతో ద్వైపాక్షిక సమావేశాలు వుంటాయి. అలాగే ఎస్‌ఐసిసి ప్రెసిడెంట్ ఫ్రానె్సస్కో ఘెరి, ప్రతినిధి డా. వోల్ఫ్ ఫ్యాంగ్‌మినాస్‌తో, ఉదయం 11.35కి రాటకొండ ఎనర్జీ కంపెనీ సిస్టమ్స్ ప్రతినిధి రాటకొండ సుబ్రహ్మణ్యంతో ముఖ్యమంత్రి ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ముఖ్యమంత్రి మధ్యాహ్నం 2గంటలకు జ్యూరిచ్ నుంచి స్టాడ్లర్ పట్టణానికి బయలుదేరి వెళతారు. 17 నుంచి దావోస్‌లో జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొంటారు.