రాష్ట్రీయం

వృత్తులకు ఊతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 15:తెలంగాణలో గొర్రెల పెంపకాన్ని భారీ పరిశ్రమగా అభివృద్ధి చేయనున్నట్టు ముఖ్యమంత్రి కెసిఆర్ తెలిపారు. ప్రగతి భవన్‌లో ఆదివారం గొర్రెల పెంపకం, మత్స్య పరిశ్రమ అభివృద్ధిపై ఉన్నతస్థాయి సమీక్ష జరిపారు. ఇతర దేశాలకు గొర్రె మాంసాన్ని ఎగుమతి చేసే స్థాయికి తెలంగాణ గొర్రెల పెంపకం పరిశ్రమ ఎదగాలని ముఖ్యమంత్రి అన్నారు. తెలంగాణలో పరిశ్రమ విస్తృతంగా అభివృద్ధి చెందడానికి అవసరమైన ప్రణాళిక రూపొందించడానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించారు. తెలంగాణ నీటిపారుదల రంగం ద్వారా ప్రజలకు భారీ మేలు జరగబోతున్నదని, ఇక వివిధ వృత్తుల మీద ఆధార పడిన ప్రజలకు పెద్దయెత్తున ఉపాధి కల్పించే ప్రణాళికను రూపొందిస్తున్నామని కెసిఆర్ తెలిపారు. గొర్రెల పెంపకం లాభసాటి వృత్తిగా మారాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో అవసరమైన గొర్రెలను మహారాష్ట్ర, కర్నాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో సహా అందుబాటులో ఉన్న రాష్ట్రాల నుండి దిగుమతి చేసుకోవాలని సూచించారు.
గొర్రెల పెంపకం, మత్స్య పరిశ్రమ అబివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో పరిశీలించి నివేదిక ఇవ్వడానికి మత్స్య, పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన క్యాబినెట్ సబ్ కమిటీ వేశారు. సబ్ కమిటీలో మంత్రులు ఈటెల రాజేందర్, జోగు రామన్న, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, జగదీశ్‌రెడ్డి సభ్యులుగా ఉంటారు.
ప్రగతి భవన్‌లో ఆదివారం జరిగిన ఈ సమావేశంలో స్పీకర్ మధుసూదనాచారి, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, ఈటెల, తలసాని, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఎంపి వినోద్, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి, గొర్రెల పెంపకందారుల సమాఖ్య చైర్మన్ రాజయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..ఆదివారం జరిపిన సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి కెసిఆర్