రాష్ట్రీయం

దొంగలు దొరికారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ గచ్చిబౌలి, జనవరి 15: రాష్టవ్య్రాప్తంగా సంచలనం సృష్టించిన రామచంద్రాపురం బీరంగూడ ముత్తూట్ ఫైనాన్స్ దోపిడీ కేసును సైబరాబాద్ పోలీసులు ఛేదించారు. కేసులో ప్రధాన సూత్రధారి లక్ష్మణ్ సహా ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వీరినుంచి మూడున్నర కిలోల బంగారం, ఐదు లక్షల నగదు, రెండు కార్లు, బైక్ స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం సైబరాబాద్ కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో కమిషనర్ సందీప్ శాండిల్య నిందితుల వివరాలను వెల్లడించారు. లక్ష్మణ్‌తోపాటు అరెస్టయిన వారిలో గణేష్ పాండురంగ బన్సీల్ పాటిల్, సుభాష్ పూజారి పాండే, విజయ్ కుమార్, కుమార్ పాల్ తిలోక్‌చంద్ షా (రిసీవర్) ఉన్నారు. సుందర్ రాజరత్నం కన్నగల్ల (41) అలియాస్ అంబు, తుకారాం గైక్వాడ్ తోపాటు వీరికి తుపాకి సమకూర్చిన టింకుల్, బంగారాన్ని కరగబెట్టిన రోషన్ పరారీలో ఉన్నట్లు సిపి తెలిపారు. ప్రధాన నిందితుడు లక్ష్మణ్ నారాయణ మదంగ్ (42) స్వస్థలం కర్ణాటకలోని కలబురిగి కాగా మహారాష్టల్రోని నాసిక్‌లో స్థిరపడ్డాడు. లక్ష్మణ్, సుభాష్‌లది ఒక ముఠా. వీరికి థానె జైలులో మిగిలిన నిందితులతో పరిచయం ఏర్పడింది. నిందితులందరికీ చోటా షకీల్, అజీజ్‌రెడ్డి గ్యాంగ్‌లతో సంబంధం ఉందని కమిషనర్ తెలిపారు. వీరంతా డిసెంబర్ 23నుండి పలు దఫాలు ముత్తూట్ ఫైనాన్స్ దోపిడీకి రెక్కీ నిర్వహించారు. 26న దోపిడీకి యత్నించిన నిందితులు, పోలీసు పెట్రోలింగ్ వాహనం కనబడడంతో వెనుదిరిగారు. 27న జోగిపేటలోని ధాబాలో బస చేసి, మర్నాడు ఉదయం 9.15గంటలకు ముత్తూట్ ఫైనాన్స్‌లోకి చొరబడి 41.8 కిలోల బంగారం, 91వేల నగదును దోచుకుపోయారు. దోపిడీ జరిపినప్పుడు తుకారం గైక్వాడ్ సిబిఐ ఆఫీసర్‌నని చెప్పి ఫైనాన్స్ సిబ్బందిని బెదరగొట్టగా, సుందర్ ట్రాఫిక్ కానిస్టేబుల్ వేషంలోనూ, లక్ష్మణ్.. సర్దార్‌జీ వేషంలోనూ వచ్చారు. దోపిడి అనంతరం కొడంగల్ మీదుగా కర్ణాటకలోని వాడీలోని తమ స్థావరాలకు పారిపోయారు. నిందితులు పారిపోతున్న సమయంలో ఇదే ముఠాకు చెందిన ఇద్దరు వ్యక్తులు అవేంజర్ బైక్‌పై ముందు వెళ్తూ పోలీసుల కదలికలను ఎప్పటికప్పుడు కారులోని వారికి వివరించేవారు. ముందు స్కార్పియో వాహనాం పైనే దృష్టి సారించామని, బైక్‌పై దొంగలకు చెందినవారే ముందు వెడుతున్నట్టు గమనించాక దర్యాప్తు ఊపు అందుకుందని చెప్పారు.