రాష్ట్రీయం

నీళ్లకే నిధులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 15: ఈసారి కూడా బడ్జెట్‌లో భారీ నీటిపారుదల ప్రాజెక్టులకు పెద్దపీట వేయనున్నారు. గత బడ్జెట్‌లో తొలిసారిగా నీటిపారుదల ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం 25వేల కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. ప్రాజెక్టులకు వరుసగా నాలుగేళ్లపాటు పాతికవేల కోట్ల రూపాయల చొప్పున కేటాయించనున్నట్టు గతంలోనే ముఖ్యమంత్రి ప్రకటించారు. వాస్తవానికి పెద్ద నోట్ల రద్దు ప్రభావం రాష్ట్ర ఆదాయంపై కొంత ప్రభావం చూపిన మాట నిజం. దీంతో ప్రాజెక్టులకు కేటాయింపుల్లో కోత తప్పదనే ఆందోళన ప్రభుత్వంలో మొదట కనిపించింది. క్రమంగా పరిస్థితి మెరుగు పడడం, కేంద్రం నుంచి మద్దతు లభించడంతో ఇప్పుడు ప్రభుత్వం కాస్త తేరుకుంది. నిధుల కేటాయింపులో ఈసారీ నీటిపారుదలకు అగ్ర తాంబూల ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చింది. సాంకేతికపరమైన అంశాలు, భూ సేకరణ వంటి పలు సమస్యలతో ప్రాజెక్టులకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అనుకున్న మేరకు ఖర్చు చేయకపోయినా, సమస్యలన్నీ తొలిగిపోయాయని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో నిధులు కేటాయించడమే కాదు, ఖర్చు చేయడం కూడా అదే స్థాయిలో ఉంటుందని నీటిపారుదల శాఖ వర్గాలు తెలిపాయి. గత బడ్జెట్‌లో ప్రాజెక్టులకు పాతిక వేల కోట్లు కేటాయిస్తూనే, మిషన్ కాకతీయకు విడిగా కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఈసారి ప్రాజెక్టులకు 31వేల కోట్ల రూపాయలు ఇవ్వాలంటూ ఆ శాఖ ప్రతిపాదనలు పంపింది. నీళ్లు, నిధులు అనే ప్రధాన నినాదంతో తెలంగాణ ఉద్యమం జరిగిన నేపథ్యంలో నీటిపారుదల రంగంలో కొత్త రాష్ట్రం ఏం సాధించిందనే ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం చెప్పుకోవలసి ఉంటుందని, అందువల్ల నీటిపారుదలకు కేటాయింపులు భారీగా జరిపి, వీలైనంత త్వరగా ప్రాజెక్టులు పూర్తి చేయాలన్న కృత నిశ్చయంతో ప్రభుత్వం ఉంది. మరోవైపు బ్యాంకులు సైతం ప్రాజెక్టులకు రుణాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి. కాళేశ్వరం ప్రాజెక్టు ఫేజ్ వన్‌కు వివిధ బ్యాంకులు 7400 కోట్ల రూపాయలు రుణంగా ఇవ్వనున్నాయి. వీటిలో 1300 కోట్ల రూపాయల రుణం ఆంధ్రాబ్యాంకు ఒక్కటే అందజేసింది.
ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రాజెక్టులకు 25వేల కోట్లు కేటాయించినా, డిసెంబర్ నాటికి పదివేల కోట్ల రూపాయలు మాత్రమే వ్యయం చేసిన విషయం గమనార్హం.
టిఆర్‌ఎస్ అధికారంలోకి రావడానికి కీలక భూమిక పోషించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పథకానికి ఈ బడ్జెట్ కేటాయింపుల్లో ప్రాధాన్యత ఇవ్వనున్నారు. మొదటి రెండు సంవత్సరాలు డబుల్ బెడ్‌రూమ్ పథకం అమలు నత్త నడక నడించింది. అయితే చివరి రెండేళ్ల పాటు ఈ పథకం వేగవంతంగా అమలు చేయాల్సి ఉంటుందనే ఉద్దేశంతో కేటాయింపుల్లో ప్రాధాన్యత ఇవ్వనున్నారు. బడ్జెట్ పై ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రగతి భవన్‌లో అధికారులతో ప్రతి రోజూ సమావేశం అవుతున్నారు.