రాష్ట్రీయం

అరుదైన పక్షుల అద్భుత సీమ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, జనవరి 15: కాకినాడ సమీపంలోని కోరంగి (కోరింగ) అభయారణ్యం కాకినాడ ఎన్టీఆర్ బీచ్ ఫెస్టివల్ నేపథ్యంలో ప్రధాన ఆకర్షణగా నిలచింది. అభయారణ్యంలోని అరుదైన వలస పక్షులు సందర్శకులను విశేషంగా అలరిస్తున్నాయి. కాకినాడ నగరంలో వాకలపూడి తీరంలో ఈనెల 12 నుండి ప్రారంభమైన బీచ్ ఫెస్టివల్ ఆదివారంతో ముగిసింది. బీచ్ ఫెస్టివల్‌కు వచ్చిన పర్యాటకుల్లో వేలాది మంది అభయారణ్యాన్ని సందర్శించారు. అభయారణ్యంలోని మడ అడవుల్లో బోటు షికారు పర్యాటకులకు మధురానుభూతిని కలిగించింది. ముఖ్యంగా ఈ అడవుల్లో వలస పక్షుల కిలకిలారావాలతో పర్యాటకులు పులకించారు. పశ్చిమ బెంగాల్‌లోని సుందర్‌బాన్ మడ అడవుల తరువాత కోరంగి మడ అడవులకు అంతటి ప్రాధాన్యత ఉంది. అరుదైన పక్షులు, జంతువులు, ఔషద గుణాలు కలిగిన అనేక విలువైన మొక్కలు, దట్టమైన పొదలు, చెట్లతో మడ అడవులు విస్తరించి ఉన్నాయి. ఈ మడ అడవులకున్న ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని 1998లో 235.70 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని వణ్య ప్రాణుల అభయారణ్యంగా గుర్తించారు. అరుదైన వృక్ష, జంతు, పక్షు జాతులు కలిగిన వైవిధ్యమైన తీర ప్రాంతంగా దీనిని గుర్తించారు. కోరంగి ప్రాంతం పక్షులకు ముఖ్య ఆహార ప్రదేశంగా, సంతానోత్పత్తికి అనువైన ప్రాంతంగా నెలకొనివుంది. శీతాకాలంలో ఎక్కడెక్కడి నుండో వచ్చే వలస పక్షులకు కేంద్రంగా మారింది. కోరంగిలో పరిశోధకులు జరిపిన అధ్యయనంలో 10 రకాల ముఖ్యమైన నీటి పక్షులను గుర్తించారు. ప్రతి సంవత్సరం శీతాకాలంలో 78వేల నుండి 88వేల వరకు పక్షులు ఆశ్రయం కోసం ఇక్కడికి తరలివస్తుంటాయని అంచనా! ఈ ప్రాంతం అరుదైన పక్షులకు ఆవాసంగా మారినట్టు బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ కూడా గుర్తించింది. ఈ అభయారణ్యంలో అటవీశాఖ ఆధ్వర్యంలో సందర్శకులు పర్యటించేందుకు వీలుగా ఉడెన్ ట్రాక్ నిర్మించారు. తుల్యభాగ నదిలో కుటుంబ సమేతంగా పర్యటించేందుకు వీలుగా ప్రత్యేక బోటు షికారు ప్యాకేజీ అమలుచేస్తున్నారు. ప్రకృతి సహజసిద్ధంగా వెలసిన ఈ మడ అడవుల్లో పర్యటించిన వారికి ప్రత్యేక అనుభూతి కలుగుతుంది.

చిత్రం..కోరంగి అభయారణ్యంలో అరుదైన పక్షులు