రాష్ట్రీయం

సుప్తచేతనావస్థలో ఎడ్‌సెట్-2017

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 20: ఉపాధ్యాయ విద్యా కళాశాలల్లో బిఇడి కోర్సులో చేరేందుకు నిర్వహించాల్సిన ఎడ్‌సెట్-2017ను తాత్కాలికంగా సుప్తచేతనావస్థలో ఉంచినట్టు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టి పాపిరెడ్డి చెప్పారు. ఎడ్‌సెట్-2016 ప్రక్రియ పూర్తికాకుండానే ఎడ్‌సెట్-2017 నిర్వహించడంపై ఆంధ్రభూమి ప్రచురించిన వార్తాకథనానికి అధికారులు స్పందించారు.
ఎడ్‌సెట్-2016 ప్రక్రియను పూర్తి చేసిన తర్వాతనే ఎడ్‌సెట్-2017 కన్వీనర్‌ను ప్రకటిస్తామని, అంత వరకూ దానిని సుప్తచేతనావస్థలో ఉంచుతామని అధికారులు చెప్పారు. మరో పక్క ఎడ్‌సెట్-2016 రెండో దశ కౌనె్సలింగ్‌కు అధికారులు షెడ్యూలు రూపొందించారు. వాస్తవానికి ఈ కౌనె్సలింగ్ నోటిఫికేషన్‌ను జనవరి తొలివారంలో ప్రకటించి, జనవరి 16 నుండి వారం రోజుల పాటు కౌనె్సలింగ్ నిర్వహించి 2016-17 విద్యాసంవత్సరాన్ని ముగించాలని ఉన్నత విద్యామండలి తొలుత భావించినా, దీనిపై సాంకేతిక అనుమానాలు తలెత్తడం, తొలి కౌనె్సలింగ్‌లో చేరిన విద్యార్ధుల పాఠాలు పూర్తయి, అపుడే మూడు నెలలు కావడంతో ఇపుడు విద్యార్ధులను చేర్చుకుంటే విద్యాసంవత్సరంలో తేడా వస్తుందని, అందరికీ కలిపి వార్షిక పరీక్షల నిర్వహణలో ఇబ్బందులు వస్తాయని వివిధ వర్శిటీల విసిలు సూచించడంతో అడ్మిషన్ల ప్రక్రియను పక్కన పెట్టారు. కాని యాజమాన్యాల సంఘం పట్టువీడకపోవడంతో ఈ అంశంపై మరో మారు చర్చించిన ఉన్నత విద్యామండలి అధికారులు అందుకు సంబంధించిన ఫైలును ఉన్నత విద్యాశాఖకు పంపించారు. దాంతో ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆచార్య ముఖ్యమంత్రి దృష్టికి ఈ అంశాన్ని తీసుకువచ్చారు. మరో పక్క డీసెట్-2016 కన్వీనర్‌గా ప్రభుత్వం శేషుకుమారిని నియమించింది. త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేసి ప్రవేశపరీక్ష నిర్వహిస్తామని పాఠశాల విద్యాశాఖాధికారులు చెప్పారు.