రాష్ట్రీయం

ఆర్‌ఆర్‌కు కేంద్రం గ్రీన్‌సిగ్నల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 20: రాష్ట్రంలో కొత్తగా 2132 కిలో మీటర్ల మేరకు జాతీయ రహదారికి కేంద్రం ఆమోదం తెలిపినందున ఈ పనులు వేగంగా జరిగేట్టు చూడాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల పనులపై మంత్రి శుక్రవారం సమీక్ష జరిపారు. హైదరాబాద్ నగరం వేగంగా విస్తరిస్తోందని , నగరం చుట్టూ ఉన్న ఔటర్ రింగు రోడ్డు పెరుగుతున్న అవసరాలకు సరిపోదని మరింత విశాలమైన పరిధిలో మరో రింగురోడ్డు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపించగా, 338 కిలో మీటర్ల అతి పొడవైన రీజనల్ రింగురోడ్డును జాతీయ ప్రమాణాలతో నిర్మించేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసినట్టు తుమ్మల తెలిపారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి డిపిఆర్‌పై మంత్రి సమావేశంలో చర్చించారు. అదే విధంగా కేంద్రం మంజూరు చేసిన జాతీయ రహదారుల డిపిఆర్‌లను సత్వరం పూర్తి చేయాలని మంత్రి చెప్పారు. సూర్యాపేట- ఖమ్మం- కొదాడ, వరంగల్- హైదరాబాద్ జాతీయ రహదారుల్లో సూర్యాపేట, మోతె, నాయకన్ గూడెం కూసుమంచి ఖమ్మం వరంగల్ పట్టణాలకు బాహ్య వలయ రహదారులు, బైపాస్ రోడ్లు ఏర్పాటు చేయాలని మంత్రి చెప్పారు. జాతీయ రహదారుల నిర్మాణానికి భూ సేకరణ, అటవీ భూముల వంటి సమస్యలు ఉంటే వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకు రావాలని సూచించారు. పనుల్లో తీవ్ర జాప్యం జరిగితే సహించేది లేదని సంబంధిత కాంట్రాక్టర్లు, కన్సల్టెంట్లు, అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వరంగల్, జనగామ, యాదాద్రి పట్టణాల వద్ద నిర్మిస్తున్న రహదారి కోసం అవసరమైన భూ సేకరణకు, ఇతర పనులకు వెంటనే అనుమతులు ఇవ్వాలని జిల్లా కలెక్టర్లకు ఫోన్ చేసి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. అదే విధంగా రోడ్ల అభివృద్ధికి సెంట్రల్ రోడ్ ఫండ్ నుంచి ఇటీవల 1,020 కోట్ల రూపాయలు మంజూరు అయ్యాయని, వీటికి సంబంధించి టెండర్లు పిలిచినట్టు చెప్పారు.