తెలంగాణ

40 కోట్లతో ఇస్లామిక్ సెంటర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 21: హైదరాబాద్‌లో అంతర్జాతీయ స్థాయిలో ఇస్లామిక్ సెంటర్, కనె్వన్షన్ హాలు నిర్మించాలని సిఎం కెసిఆర్ నిర్ణయించారు. నగరంలోని మణికొండలో ఆరు ఎకరాల వక్ఫ్ స్థలంలో 40 కోట్ల వ్యయంతో నిర్మించే ఇస్లామిక్ సెంటర్‌ను త్వరలోనే తానే శంకుస్థాపన చేయనున్నట్టు వెల్లడించారు. ముస్లింలకు సంబంధించిన కార్యక్రమాలన్నింటినీ సమన్వయం చేసే వేదికగా ఇస్లామిక్ సెంటర్ ఉపయోగపడాలని, దీనికోసం మంచి డిజైన్లు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. మైనారిటీల అభివృద్ధి, సంక్షేమానికి సంబంధించి మైనారిటీ శాఖ సలహాదారు ఎకె ఖాన్, మైనారిటీ శాఖ కార్యదర్శి ఉమర్ జలీల్ తదితరులతో సిఎం శనివారం చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. రూ. 21 కోట్ల వ్యయంతో నాంపల్లిలోని అనీస్- ఉల్- గుర్బా స్థలంలో ముస్లింల కోసం అనాథాశ్రయం నిర్మించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన ఫైలుపై శనివారం సంతకం చేశారు. ఇప్పటికే నాలుగువేల గజాల విలువైన స్థలాన్ని అనీస్ ఉల్ గుర్బాకు కేటాయించినట్టు చెప్పారు. ఈ స్థలంలో బహుళ అంతస్తుల భవనం నిర్మించాలని, త్వరలోనే శంకుస్థాపన చేయాలని నిర్ణయించారు. ఉర్దూ మీడియం పాఠశాలలు, కళాశాలల్లో అధ్యాపకుల పోస్టుల భర్తీకి వెంటనే ప్రత్యేక డిఎస్సీ నిర్వహించాలని సిఎం కెసిఆర్ అధికారులను ఆదేశించారు. ఈ విద్యా సంస్థల్లో ఖాళీలను గుర్తించి నోటిఫికేషన్ జారీ చేయాలన్నారు. హైదరాబాద్ మక్కా మసీదు అభివృద్ధికి 8.48 కోట్లు మంజూరు చేశారు. ముస్లింల పవిత్ర ప్రార్థనా మందిరమే కాకుండా, హైదరాబాద్‌లోని ప్రముఖ కట్టడాల్లో ఒకటైన మక్కా మసీదుకు అవసరమైన మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. రాష్టవ్య్రాప్తంగా ఇమామ్, వౌజమ్‌ల గౌరవ భృతి నెలకు వెయ్యి నుంచి 15 వందలకు పెంచుతూ రూపొందించిన జీవోపై సిఎం శనివారం సంతకం చేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి పెంచిన భృతి అందించాలన్నారు. పలక్ నామాలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీని డిగ్రీ కాలేజీగా అప్‌గ్రేడ్ చేయాలని ఆదేశించారు. డిగ్రీ కాలేజీ నిర్వాహణ, ఏర్పాట్లకు పది కోట్లు మంజూరు చేశారు. ముస్లింలకు ప్రత్యేకంగా ఐటి సెజ్ ఏర్పాటు చేయాలని ఐటి మంత్రి కెటిఆర్‌ను సిఎం కెసిఆర్ ఆదేశించారు. దీని కోసం అనువైన స్థలం ఎంపిక చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో 17 మైనారిటీ జూనియర్ కాలేజీలు, నాలుగు మైనారిటీ డిగ్రీ కాలేజీల్లో సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోర్సులకు నిధులు మంజూరు చేయాలని ఆదేశించారు. ఈ విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులు కోర్సులకు ఫీజులు చెల్లించే అవసరం లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
నీట్‌ను ఉర్దూలో నిర్వహించాలని ప్రధానికి లేఖ
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్) పరీక్షను ఉర్దూ భాషలో కూడా నిర్వహించాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి సిఎం కెసిఆర్ లేఖ రాశారు. దేశవ్యాప్తంగా ఉర్దూ చదివే విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఉన్నారని, ముస్లిం పిల్లలు ఉర్దూ భాషలోనే విద్యాభ్యాసం చేస్తున్నారని చెప్పారు. నీట్‌ను ఇప్పటికే అనేక ప్రాంతీయ భాషల్లో నిర్వహిస్తున్నందున ఉర్దూ భాషలోనూ నిర్వహించాలని కోరారు. దేశవ్యాప్తంగా ఒకే విధమైన విద్యా ప్రమాణాలు నెలకొల్పడానికి నీట్ పరీక్ష నిర్వహించడాన్ని సిఎం తన లేఖలో అభినందించారు.