రాష్ట్రీయం

జీవిత ఖైదీలు జైల్లోనే ఉండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 21: ఏపి రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఉప కార్యదర్శి ఖాదిర్ హత్య కేసులో జీవిత ఖైదును అనుభవిస్తున్న మహమ్మద్ ఇర్ఫాన్ అలీకి పెరోల్ పొడిగించేందుకు తిరస్కరిస్తూ హైకోర్టు ధర్మాసనం తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. జీవిత ఖైదు అనుభవిస్తున్న దోషి జైలులోనే ఉండాలని, పెరోల్ పెండింగ్‌లో ఉందన్న కారణంతో ఇటువంటి దోషులు జైలు వెలుపల ఉండేందుకు వీల్లేదని, కనుక విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగిని హత్య కేసులో దోషిగా తేలిన ఇర్ఫాన్ అలీ పిటిషన్‌ను తిరస్కరించడం సమంజసమైన చర్యేనని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి రమేష్ రంగనాథం, జస్టిస్ షామీమ్ అక్తర్‌లతో కూడిన హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. జీవిత ఖైదు అనుభవిస్తున్న వ్యక్తికి జైలు నిబంధనల ప్రకారం నెలకు మించి పెరోల్ ఇవ్వడానికి వీలులేదని, బంధువు అనారోగ్యంతో బాధపడుతున్నాడన్న కారణంతో ఇటువంటి దోషులకు పెరోల్‌ను పొడిగించడం సహేతుకం కాదని హైకోర్టు పేర్కొంది. ఈ కేసులో జీవిత ఖైదు పడిన ఇర్ఫాన్ తన భార్య అనారోగ్యంతో బాధపడుతోందన్న కారణంతో 2015 సెప్టెంబర్ 4న చర్లపల్లి జైలు నుంచి పెరోల్‌పై విడుదలయ్యాడు. అయితే పెరోల్ పొడిగింపు కోసం ఇర్ఫాన్ దరఖాస్తు చేసుకోదలిస్తే ముందుగా జైలుకెళ్లి, ఆ తర్వాతే దరఖాస్తు చేసుకోవాలని, ఏది ఏమైనప్పటికీ చట్టానికి లోబడి మాత్రమే పెరోల్ ఇవ్వాల్సి ఉంటుందని హైకోర్టు పేర్కొంది.