తెలంగాణ

70మందికి స్వైన్ ఫ్లూ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 21: ఈ ఏడాది ఇప్పటి వరకు 70 మందికి స్వైన్ ఫ్లూ సోకినట్టు గుర్తించినట్టు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు 5,700 మందికి స్వైన్ ఫ్లూ వ్యాధి నిర్థారణ పరీక్షలు నిర్వహించగా, వీరిలో 70 మందికి వ్యాధి సోకినట్టు తేలిందని చెప్పారు. స్వైన్ ఫ్లూను ఎదుర్కోవడానికి వైద్య శాఖ సర్వసన్నద్ధంగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి చెప్పారు. వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తిస్తే నయం చేయడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లతో వైద్య శాఖ సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. నిమ్స్ ఆస్పత్రిని మంత్రి శనివారం సందర్శించారు. స్వైన్ ఫ్లూ నివారించలేని వ్యాధి కాదని చెప్పారు. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఈ వ్యాధి నిర్ధారణ, చికిత్సకు అవసరం అయిన ఏర్పాట్లు ఉన్నాయని తెలిపారు. వ్యాధిని ప్రారంభంలో గుర్తించక, ముదిరిపోయిన తరువాత చివరి దశలో చికిత్స కోసం ఆస్పత్రిలో చేరడం వంటి సంఘటనల్లో కొద్ది మంది మరణించారని చెప్పారు. తీవ్రంగా జ్వరం, తలనొప్పి, కీళ్ల నొప్పులు, ముక్కు కారడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే రోగులు సమీప వైద్యశాలను సంప్రదించాలని మంత్రి సూచించారు.
స్వైన్‌ఫ్లూపై ఆందోళన చెందవద్దని, ముందుగా గుర్తిస్తే చికిత్స అందించవచ్చునని అన్నారు. టాంజానియానుంచి స్వైన్ ఫ్లూతో వచ్చి నిమ్స్‌లో చికిత్స పొందుతున్న అశ్వినిని మంత్రి పరామర్శించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చి నిమ్స్ అత్యవసర వార్డులో చికిత్స పొందుతున్న తిమ్మన్న, రవీందర్‌రెడ్డి, భరత్‌లతో పాటు పలువురు రోగులతో మంత్రి మాట్లాడారు. ఆస్పత్రిలో వైద్యం, సౌకర్యాల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. మంత్రి వెంట నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ కె మనోహర్, హెల్త్ యూనివర్సిటీ విసి డాక్టర్ కరుణాకర్‌రెడ్డి, రిజిస్ట్రార్ టివి రావు, నిమ్స్ అధికారులు, డాక్టర్లు, సిబ్బంది ఉన్నారు.