తెలంగాణ

మహిళా కండక్టర్లకు కరాటే శిక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 21: మహిళా కండక్టరే కదా! అని తేలిగ్గా భావిస్తున్నట్లయితే వారు వెంటనే ఆ భావాన్ని మార్చుకోవాల్సిందే. మహిళా కండక్టర్లకు తెలంగాణ ఆర్టీసీ అధికారులు కరాటేలో శిక్షణ ఇప్పిస్తున్నారు. శిక్షణ పొందడం ద్వారా ఆత్మరక్షణే కాకుండా ప్రయాణికులకూ తగిన భద్రత కల్పించేందుకు అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. శనివారం హకీంపేటలోని జోనల్ స్ట్ఫా ట్రైనింగ్ కళాశాలలో కరాటే శిక్షణ పొందిన హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ జోనల్ మహిళా కండక్టర్లను ఉద్ధేశించి ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ జి.వి. రమణారావు ప్రసంగిస్తూ మహిళా కండక్టర్లు కరాటే నేర్చుకోవడం వల్ల ఆరోగ్యం సమకూర్చుకోవడంతో పాటు ఆత్మస్థైర్యం పెంపొందించుకోవడమే కాకుండా ఆత్మరక్షణకూ ఉపయోగపడుతుందని అన్నారు. విధి నిర్వహణలో ఉత్పన్నమయ్యే సమస్యలను అధిగమించేందుకు కరాటే ఎంతో ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. హకీంపేట ట్రాన్స్‌పోర్టు అకాడమీ, జోనల్ స్ట్ఫా ట్రైనింగ్ కళాశాల ప్రిన్సిపాల్, సిపిఆర్‌వో జిఆర్ కిరణ్ మాట్లాడుతూ అన్ని రంగాల్లో దూసుకునిపోతున్న మహిళలకు స్వీయ రక్షణ కోసం కరాటేలో శిక్షణ ఎంతైనా అవసరమని అన్నారు.