రాష్ట్రీయం

టెక్నాలజీతోనే విప్లవాత్మక మార్పులు సాధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ఘట్‌కేసర్, జనవరి 21: దేశంలో సాంకేతిక రంగాన్ని మరింత పెంపొందించి విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చేందుకు విద్యార్థులు నిరంతరం కృషి చేయాలని బిజెపి జాతీయ కార్యవర్గసభ్యుడు, ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్ ఎంపి వరుణ్‌గాంధీ అన్నారు. శనివారం మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ మండలం కొండాపూర్ గ్రామంలోని శ్రీనిధి ఇంజనీరింగ్ కళాశాల వార్షికోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. భారతదేశ భవిష్యత్ యువత చేతుల్లో ఉందని, వినూత్న మార్పులు తీసుకువచ్చేందుకు నిరంతరం కృషి చేయాలన్నారు. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని విద్యార్థులు పెంపొందించుకుని దేశప్రగతికి దోహదపడాలని సూచించారు. దేశంలో వెనుకబడి ఉన్న పేదలు, గిరిజనుల పరిస్థితులను విద్యార్థులు అర్థం చేసుకుని వారి అభివృద్ధికి బాటలువేసేందుకు ప్రయత్నించాలని చెప్పారు. అభివృద్ధి చెందటానికి అనేకమార్గాలు ఉన్నాయని, వాటిని అనే్వషించి అందరికీ అందుబాటులోకి తీసుకు రావాలన్నారు.
క్రీడలు, సాంకేతిక విద్య, ఐటి రంగం, పారిశ్రామిక రంగాలలో బెంగళూరు, హైద్రాబాద్‌లలో రాణించిన పలువురి నైపుణ్యాన్ని ఆయన విద్యార్థులకు వివరించి చైతన్యపరిచారు. సమాచార హక్కు చట్టం ధనికులు, పేదలకు సమానంగా పనిచేస్తుందని, ఎక్కడ సమస్య వచ్చినా అక్కడే పరిష్కరించుకునే అవకాశం ఈ చట్టం ద్వారా లభిస్తుందన్నారు. ప్రతి విద్యార్థి ఆర్టీఐ చట్టాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
వార్షికోత్సవం సందర్భంగా కళాశాల విద్యార్థులు నిర్వహించిన వివిధ రకాల ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ సందర్భంగా వివిధ రంగాలలో అత్యున్నత ప్రతిభను కనపరిచిన విద్యార్థినీ విద్యార్థులకు వరుణ్‌గాంధీ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. అనంతరం ఆయన కళాశాల ఆవరణలో మొక్కను నాటారు. శ్రీనిధి ఇంజనీరింగ్ కళాశాల అధ్యక్షుడు డాక్టర్ పృథ్వీపతిరాజు, కార్యదర్శి కెటి మహి,డైరెక్టర్ నర్సింహారెడ్డి, ప్రిన్సిపాల్ సుమంత్ అధ్యాపక బృందం తదితరులు పాల్గొన్నారు.
chitram...
శ్రీనిధి ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన వార్షికోత్సవంలో మాట్లాడుతున్న వరుణ్‌గాంధీ. విద్యార్థులకు బహుమతులు అందజేస్తున్న దృశ్యం