రాష్ట్రీయం

ప్రముఖ శాస్తవ్రేత్త పివి సూర్యప్రకాశరావు కన్నుమూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగ్గయ్యపేట రూరల్, జనవరి 21: వ్యవసాయ రంగ శాస్తవ్రేత్త, పంగనామముల సమాఖ్య చైర్మన్ పంగనామముల వెంకట సూర్యప్రకాశరావు (96) శనివారం ఉదయం 10గంటలకు హైదరాబాదులోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో హృద్రోగంతో కన్నుమూశారు. ఆయన ఆహార ఉత్పత్తి రంగంలో పేరు గాంచిన శాస్తవ్రేత్త. ఆయనకు ఒక కుమార్తె, ముగ్గురు కుమారులు, మనుమలు, మనుమరాండ్రు ఉన్నారు. సతీమణి దుర్గాంబ 2009లో మరణించారు. 1921 జూన్ 21న కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం షేర్‌మహమ్మద్‌పేట గ్రామంలో అప్పటి గ్రామకరణం పంగనామముల లక్ష్మయ్య, వెంకట రామనర్సమ్మ దంపతులకు మూడవ సంతానంగా జన్మించారు. ఆ రోజుల్లోనే వ్యవసాయ విద్య మీద ఆసక్తితో కోయంబత్తూరులో అగ్రికల్చర్ బిఎస్‌సి చేశారు. దేశ విభజనకు ముందుకు పాకిస్తాన్‌లోని లాయల్‌పూర్‌లో ఎంఎస్‌సి పూర్తి చేశారు. 1956లో కొలంబో పథకం కింద ఏడాది పాటు ఆస్ట్రేలియాకు ప్రభుత్వం తరపున వెళ్లి ఉన్నతవిద్యను అభ్యసించారు. జన్మభూమిపై మమకారంతో స్వగ్రామమైన షేర్‌మహమ్మద్‌పేట గ్రామంలో తల్లిదండ్రుల పేరున జిల్లా పరిషత్ హైస్కూల్ స్థాపనకు పనాస కుటుంబ సభ్యులతో కలిసి 3ఎకరాల స్థలాన్ని 2004లో వితరణగా ఇచ్చారు. ఇప్పుడు ఆ పాఠశాల ప్రఖ్యాత విద్యాసంస్థగా పేరు గడించింది. జగ్గయ్యపేట గాయత్రి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో కల్యాణ మండప నిర్మాణానికి పనాస కుటుంబం తరుపున రూ.7లక్షల విరాళం అందజేసి తన ఉదారతను చాటుకున్నారు. ఆయన సంతానానే్న కాకుండా సోదర సోదరీమణుల కుటుంబాలను ఒకటిగా చేసి ‘పనాస ట్రస్ట్’ను స్థాపించి ఆదర్శంగా నిలవడంతో పాటు అందరికీ ఆర్థిక సహాయాన్ని అందజేశారు. 2013లో చికాగోలో జరిగిన అంతర్జాతీయ ఆహార సాంకేతిక రంగం వారు అందించిన జీవన సాఫల్య పురస్కారాన్ని ఆయన అందుకున్నారు. పివి సూర్యప్రకాశరావు మృతికి పనాస కుటుంబం నివాళులర్పించారు. షేర్‌మహమ్మద్‌పేట జిల్లా పరిషత్ హైస్కూల్ ఉపాధ్యాయులు విద్యార్థులు, గాయత్రి బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు సూర్య ప్రకాశరావు మృతికి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆంధ్రభూమి దినపత్రిక ప్రధాన సంపాదకులు ఎంవిఆర్ శాస్ర్తీ వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం వ్యక్తం చేశారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని స్మరించుకున్నారు. ఈ ఏడాది జనవరి 1న జగ్గయ్యపేట, హైదరాబాదు, అమెరికాలోని పనాస ట్రస్ట్ సభ్యులతో ఒక ప్రత్యేక సమావేశం ద్వారా తన ఆత్మీయతను పంచుకున్నారు.