రాష్ట్రీయం

విలువల్లేని అభివృద్ధి సరికాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, ఫిబ్రవరి 2: నైతిక విలువలు లేని అభివృద్ధి ఎంత మాత్రం సరికాదని భగత్ సింగ్ సొదరుడి కొడుకు కిరణ్‌జిత్ సింగ్ సింధూ అన్నారు. ‘సుస్థిర అభివృద్ధిలో ధర్మం పాత్ర’ అనే అంశంపై ఆర్యసమాజ్ ఆధ్వర్యంలో మూడు రోజుల జాతీయ స్థాయి సమ్మేళనాన్ని స్వామి అగ్నివేష్, ప్రణనానంద్, ధర్మానంద్ సరస్వతితో కలిసి గురువారం ప్రారంభించారు. భారతదేశం తన మూలశక్తిగా ఉన్న నైతికత, మానవ విలువలకు దూరం అవుతూ వస్తు సంస్కృతికి, భౌతిక రూపానికి, డబ్బు, వినిమయ సంస్కృతికి పెద్దపీట వేయడం ఆందోళన కలిగించే అంశమని అన్నారు. అభివృద్ధిలో దూసుకుపోతూ మానవ విలువలు అంతరించిపోవడంపై ప్రతి ఒక్కరూ దృష్టి సారించాల్సి ఉందని చెప్పారు. ప్రకృతి విధ్వంసం, మనరుల ధ్వంసంతో మానవాళికి మేలు కంటే కీడు ఎక్కువని అన్నారు. ప్రకృతిని కాపాడుతూ మానవుడు ప్రకృతితో సహజీవనం చేయాలని కోరారు. వస్తు వినిమయ మోజులో పడి మానవుడు తన విలువను కోల్పోవడం విచారించదగిన విషయమని చెప్పారు. ఓ వైపు తాగునీరు, సాగునీరు అందిస్తున్నామని ప్రచారం చేసుకుంటున్న ప్రభుత్వాలే మద్యాన్ని సైతం విక్రయించడం సబబు కాదని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా కనుమరుగవుతున్న మానవీయ విలువలు, ధార్మిక చింతనలపై చర్చించేందుకు జాతీయ స్థాయి విద్వాంసులు, బుద్ధిజీవులు, బహృత్ సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నట్టు ఆర్యసమాజ్ తెలంగాణ, ఏపి రాష్ట్రాల అధ్యక్షుడు విఠల్‌రావు తెలిపారు. పలు రకాల రుగ్మతలు, అవలక్షణాల నుంచి బయటపడేందుకు మూడు రోజుల పాటు చర్చిస్తామన్నారు. ఆర్యసమాజ్ అంటే కేవలం ఆధ్యాత్మిక చింతన బోధించే సంస్థ మాత్రమే కాదని, సమాజంలో మానవీయ విలువలను పెంపొదించేందుకు కృషి చేస్తుందని చెప్పారు. ఆర్యసమాజ్ విశిష్టతలతో రూపొందించిన క్యా లెండర్‌ను ఆవిష్కరించారు. సురేష్ అగర్వాల్, మితాయ్ లాల్ అగర్వాల్, వేద్‌ప్రతాప్ వేదిక్, రఘువీర్ హాజరయ్యారు.

చిత్రం..సమ్మేళనంలో మాట్లాడుతున్న కిరణ్‌జిత్ సింగ్