రాష్ట్రీయం

సాధికారత కుటుంబంనుంచే మొదలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఫిబ్రవరి 11: అమెరికాలో ఇప్పటికీ వివక్ష ఉందని, ఇటీవల జరిగిన ఎన్నికలే దానికి నిదర్శనమని హెరిటేజ్ ఫుడ్స్ డైరెక్టర్, ముఖ్యమంత్రి చంద్రబాబు కోడలు నారా బ్రాహ్మణి అన్నారు. తొలి జాతీయ మహిళా పార్లమెంటును ఉద్దేశించి శనివారం ఈ యువ వ్యాపారవేత్త చేసిన ప్రసంగం అందర్నీ ఆకట్టుకుంది. తల్లి పేరును ముందుపెట్టుకుని ఈ ప్రాంతాన్ని పాలించిన చక్రవర్తి గౌతమీ పుత్ర శాతకర్ణి ఈ ప్రాంతానికి ఆదర్శమని, ఇలాంటి ప్రాంతంలో మహిళా పార్లమెంటు నిర్వహించటం ఆనందదాయకమని అన్నారు.
మహిళా సాధికారత అనేది కుటుంబం నుంచే ప్రారంభం కావాలని, అది తన కుటుంబంలో అమలవుతోందని చెప్పారు. ‘మా ఇంట్లో స్ర్తిలకు గౌరవం ఇచ్చే మంచి వాతావరణం ఉంది. ఎన్టీఆర్ మనవరాలిగా పుట్టడం, చంద్రబాబు కోడలినవ్వడం గర్వంగా ఉంది’ అని బాహ్మణి అన్నారు. ఆస్తిలో మహిళలకు సమాన హక్కు కల్పించిన ఘనత ఎన్టీరామారావుదేనని గుర్తు చేశారు. పద్మావతి యూనివర్శిటీ పేరుతో మహిళల కోసమే దేశంలో తొలి విశ్వవిద్యాలయాన్ని స్థాపించింది ఎన్టీఆరేనని ప్రస్తావించారు.
ఎన్టీఆర్ అడుగుజాడల్లోనే ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నడిచారని, డ్వాక్రా మహిళలను పెద్దఎత్తున ప్రోత్సహించారని అన్నారు. మహిళా సాధికారత కోసం కృషి చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబేనని అంటూ, ఆయన్ని ఫెమినిస్ట్ ఛీప్ మినిస్టర్ అనడాన్ని అంగీకరిస్తానని చెప్పారు. ఢిల్లీ హైకోర్టు మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి తెలుగువారే కావడం గర్వకారణమని బ్రాహ్మణి అన్నారు.ఎవరో వచ్చి ఆదుకుంటారని ఎదురుచూడకుండా వాటిని అందిపుచ్చుకోవటంలోనే సాధికారత సాధ్యమవుతుందని భావిస్తున్నానని అన్నారు. ముఖ్యంగా అక్షరాస్యతతోనే ఇది సాధ్యమవుతుందని చెప్పారు. తమ సమస్యలను తామే పరిష్కరించుకునే స్థాయికి మహిళలు చేరుకోవాలంటే విద్య అవసరమన్నారు.మహిళలు నిర్ణయాధికారాన్ని తీసుకునేలా ధైర్య సాహసాలను కలిగివుండాలని యూపీఎస్పీ మాజీ ఛైర్మన్ ఆల్కా సిరోహి తన అభిప్రాయాన్ని చెప్పారు. ప్రతి అంశాన్ని ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని వనితలకు పిలుపునిచ్చారు. సమాన అవకాశాలున్నాయని రాజ్యాంగమే చెబుతున్నా క్షేత్రస్థాయిలో ఆ తరహా పరిస్థితులు లేనేలేవని కేరళ డెప్యూటీ స్పీకర్ శైలజా టీచర్ ఆవేదన వెలిబుచ్చారు. పనిచేసే ప్రతిచోటా మహిళలకు వేదింపులు ఎదురవుతూనే ఉన్నాయని, ఎక్కడా స్వేచ్ఛాయుత వాతావరణం లేనేలేదని ఆమె చెప్పారు. పౌరురాలిగా, కుటుంబ సన్యురాలిగా మహిళలు నిరంతరం సమస్యలతో పాటు వివక్షను ఎదుర్కొంటున్నారని అన్నారు. జనాభాలో సగం ఉన్న మహిళలు తమ అవకాశాలను తామే సృష్టించుకోవాలని సిఐఐ ఛైర్‌పర్సన్ వనిత దాట్ల చెప్పారు. అవకాశాలను అందిపుచ్చుకుని కుటుంబానికి, సమాజానికి ఆదర్శప్రాయంగా నిలవాలని అన్నారు. ప్రతి మహిళ తనలో అపారమైన శక్తియుక్తులు దాగి ఉన్నాయని గుర్తించాలన్నారు.

చిత్రం.. ప్రసంగిస్తున్న బ్రాహ్మణి